‘సమైక్య శంఖారావం’ పార్కింగ్ ఇలా | planing of Samaikya Sankharavam | Sakshi
Sakshi News home page

‘సమైక్య శంఖారావం’ పార్కింగ్ ఇలా

Oct 25 2013 3:35 AM | Updated on May 25 2018 9:12 PM

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ నగరంలోని ఎల్బీ స్టేడియంలో శనివారం సమైక్య శంఖారావం పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది.

సాక్షి, సిటీబ్యూరో : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ నగరంలోని ఎల్బీ స్టేడియంలో శనివారం సమైక్య శంఖారావం పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. పార్టీ అభిమానులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో వస్తారని భావిస్తున్న పోలీసులు దీనికి విసృ్తత బందోబస్తు, భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వచ్చే వాహనాలు హైదరాబాద్ నగరంలోకి ప్రవేశించాక సభావేదిక వద్దకు వెళ్లేందుకు ప్రత్యేక మార్గాలు, పార్కింగ్ సౌకర్యాలు కల్పిం చారు.
 
 వాహనాల్లో వచ్చిన కార్యకర్తలు, అభిమానులు ఎన్టీఆర్ స్టేడియం, ఎంజే మార్కెట్ వద్ద దిగిపోవాలి. అక్కడ నుంచి వాహనాలను వాటికి కేటాయించిన పార్కింగ్ ప్రాంతాలకు తీసుకువెళ్లి పార్కింగ్ చేయాలి. కార్యకర్తలు, అభిమానులు కాలినడకన వేదిక వద్దకు చేరుకోవాల్సి ఉంటుంది. సభ పూర్తయిన తరువాత సైతం ఎన్టీఆర్ స్టేడియం, ఎంజే మార్కెట్ వద్ద నుంచే  తమ తమ వాహనాల్లో ఎక్కి వెళ్లాల్సి ఉంటుంది. సహాయసహకారాలు, సూచనల కోసం విధుల్లో ఉండే వలంటీర్లు, ట్రాఫిక్, శాంతిభద్రతల విభాగం పోలీసుల్ని సంప్రదించవచ్చు.
 
 ‘పశ్చిమ’ వాహనాలకు మార్గాలు, పార్కింగ్ ఇలా...
 విజయవాడ, నాగార్జునసాగర్ మార్గాల్లో వచ్చే వాహనాలు నల్లగొండ చౌరస్తా, చాదర్‌ఘాట్, కాచిగూడ ట్రాఫిక్ పోలీసుస్టేషన్, కాచిగూడ రైల్వేస్టేషన్, టూరిస్ట్ హోటల్, బర్కత్‌పుర, క్రౌన్ కేఫ్, బాగ్‌లింగంపల్లి, వీఎస్టీ, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ మీదుగా ప్రయాణించి ఎన్టీఆర్ స్టేడియం వద్దకు చేరుకోవాలి. కార్యకర్తలు అభిమానుల్ని అక్కడ దింపేసి వాహనాలను ఎన్టీఆర్ స్టేడియం, సికింద్రాబాద్‌లోని పరేడ్‌గ్రౌండ్స్‌లో పార్క్ చేసుకోవాల్సి ఉంటుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement