ప్రాణదాతలూ.. కరుణించండి

Parents Asks Hel For Son Liver Plantation in East Godavari - Sakshi

బిడ్డ శస్త్రచికిత్స ఖర్చు కోసం పేద దంపతుల వినతి

తూర్పుగోదావరి , రౌతులపూడి (ప్రత్తిపాడు): ఆ నిరుపేద కుటుంబానికి పెద్ద కష్టం వచ్చింది. కూలి పనులు చేసుకుంటూ అష్టకష్టాలు పడుతున్న వారి ఇంటిలోని బాలుడికి కాలేయ మార్పిడి చేయాల్సి వచ్చింది. రూ.25 లక్షలతో ఈమేరకు శస్త్రచికిత్స చేయించలేదని వారు దాతల సాయాన్ని కోరుతున్నారు. మండలంలోని బలరామపురానికి చెందిన దాసరి శ్రీనివాస్, జానకి కుమారుడు ఉమా మణికంఠస్వామి కాలేయ వ్యాధితో కొంతకాలంగా అనారోగ్యంగా ఉన్నాడు.

పదో తరగతి చదువుతోన్న ఇతడికి కాలేయ మార్పిడి అవసరమని వైద్యులు నిర్ధారించారు. ఇందుకు శస్త్రచికిత్స చేయడానికి రూ.25 లక్షలు అవసరమని వారు చెప్పారు. బిడ్డను రక్షించుకునేందుకు అంత సొమ్ము ఎలా సమకూర్చుకోవాలో తెలియక అతడి తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. ఒక ప్రాణాన్ని రక్షించేందుకు దాతలు సహాయం చేయాలని బుధవారం వారు విలేకరుల వద్ద ప్రాథేయపడ్డారు. ప్రస్తుతం ఈ విద్యార్థికి హైదరాబాద్‌లోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో వైద్యం చేయిస్తున్నారు. సహాయం చేసేవారు దాసరి ఉమా మణికంఠస్వామి ఆంధ్రా బ్యాంకు ఖాతా 056110100330227, ఐఎఫ్‌ఎస్సీ కోడ్‌ నెంబరు: ఏఎన్‌డీబీ 0000561కు జమ చేయాలని వారు వేడుకున్నారు. పూర్తి వివరాలకు 80086 22695కు ఫోన్‌ చేయాలని వారు కోరుతున్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top