ఔట్‌పేషెంట్ సేవలు బంద్ | Outpatient services stalled due to Seemandhra Strike | Sakshi
Sakshi News home page

ఔట్‌పేషెంట్ సేవలు బంద్

Sep 5 2013 1:56 AM | Updated on Sep 1 2017 10:26 PM

ఉస్మానియా ఆస్పత్రిలో సూపరింటెండెంట్‌గా నియమితులైన సీమాంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తిని పక్కకు తొలగించి బలవంతంగా మరో వ్యక్తిని ఆ కుర్చీలో కూర్చోబెట్టడంపై సీమాంధ్రలో వైద్యుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది.

సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా ఆస్పత్రిలో సూపరింటెండెంట్‌గా నియమితులైన సీమాంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తిని పక్కకు తొలగించి బలవంతంగా మరో వ్యక్తిని ఆ కుర్చీలో కూర్చోబెట్టడంపై సీమాంధ్రలో వైద్యుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. సమైక్యాంధ్ర ఉద్యమంతో అట్టుడుకుతున్న 13 జిల్లాల్లో ఈ ఘటన అగ్నికి ఆజ్యం పోసింది. ఆ జిలాలన్నింట్లోనూ ఔట్‌పేషెంట్ సేవలు నిలిపివేశారు. సాధారణ శస్త్రచికిత్సలను కూడా ఆపేశారు. ఎమర్జన్సీ సేవలు మినహా ఎక్కడా రోగులకు సేవలు అందలేదు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రులు, బోధనాసుపత్రుల్లో ఎక్కడా కూడా ఒక్క రోగిని కూడా ఓపీలో చూడలేదు. దాంతో బుధవారం ప్రభుత్వాసుపత్రుల్లో రోగులు తీవ్ర బాధలు పడ్డారు. ఆంధ్రా వైద్య కళాశాల, కర్నూలు వైద్య కళాశాలతో పాటు రిమ్స్‌ల్లో పరిస్థితి దారుణంగా పరిణమించింది. సుమారు 25వేల మందికి ఓపీ సేవలు అందలేదు.
 
 ఉస్మానియా ఘటనకు బాధ్యులను సస్పెండ్ చేయకుంటే నిరవధిక సమ్మెకు దిగుతామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైద్యుల సంఘం హెచ్చరించింది. సీమాంధ్ర వైద్యులు హైదరాబాద్‌లో బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారనేందుకు ఉస్మానియా ఘటనే తార్కాణమని సంఘం అధ్యక్షుడు డాక్టర్ రామ్మోహన్ అన్నారు. ప్రభుత్వం అధికారికంగా నియమించిన వ్యక్తిని అడ్డుకున్నారంటే తెలంగాణ వైద్యుల దౌర్జన్యకాండ ఏ రకంగా సాగుతోందో అర్థం చేసుకోవచ్చునన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement