డీకే అరుణ భర్త మైనింగ్ కంపెనీల్లో తనిఖీలు | officers Search dk aruna mining companies | Sakshi
Sakshi News home page

డీకే అరుణ భర్త మైనింగ్ కంపెనీల్లో తనిఖీలు

Feb 7 2014 4:56 PM | Updated on Oct 8 2018 5:04 PM

రాష్ట్ర సమాచార శాఖ మంత్రి డి.కె.అరుణ భర్త భరత నరసింహారెడ్డి మైనింగ్ కంపెనీల్లో అధికారులు తనిఖీలు ఆరంభించారు.

మహబూబ్నగర్: రాష్ట్ర సమాచార శాఖ మంత్రి డి.కె.అరుణ భర్త భరత నరసింహారెడ్డి  మైనింగ్ కంపెనీల్లో అధికారులు తనిఖీలు ఆరంభించారు. అరుణ భర్త కంపెనీల్లో అక్రమ మైనింగ్ నిర్వహిస్తున్నారంటూ హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో అధికారులు తనిఖీలు ప్రారంభించారు. భర్త భరతసింహారెడ్డిపై వచ్చిన అక్రమ మైనింగ్,  రేషన్ కిరోసిన్ అక్రమ వినియోగం తదితర ఆరోపణలపై పూర్తిస్థాయిలో విచారణ జరపాలని మహబూబ్నగర్ జిల్లా అధికారులను హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే.  దీంతో రంగంలోకి దిగిన అధికారులు శుక్రవారం తనిఖీలు చేస్తున్నారు 

 

జిల్లాలోని మన్నాపురం గ్రామ పరిధిలోని భూమిలో చేస్తున్న మైనింగ్లో అక్రమాలు జరుగుతున్నాయని, దీనిపై ఫిర్యాదులు చేసినా పట్టించుకోవటం లేదంటూ గద్వాల్ టౌన్కు చెందిన మాజీ జెడ్పీటీసీ సభ్యుడు బి.కృష్ణమోహన్ రెడ్డి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement