‘సిద్దిపేట రెవెన్యూ’కే చేగుంట | Now Chegunta is under siddipet revenue department | Sakshi
Sakshi News home page

‘సిద్దిపేట రెవెన్యూ’కే చేగుంట

Oct 30 2013 11:37 PM | Updated on Sep 2 2017 12:08 AM

చేగుంట మండలం ఇక నుంచి సిద్దిపేట రెవెన్యూ డివిజన్ పరిధిలో రానుంది.

సాక్షి, సంగారెడ్డి:  చేగుంట మండలం ఇక నుంచి సిద్దిపేట రెవెన్యూ డివిజన్ పరిధిలో రానుంది. ఆ మండలాన్ని మెదక్ రెవెన్యూ డివిజన్ పరిధి నుంచి  సిద్దిపేట రెవెన్యూ డివిజన్‌కు పరిధిలోకి మారుస్తూ రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శి బీఆర్ మీనా బుధవారం తుది ఉత్తర్వులు (జీవో ఎంఎస్.నెం.553) జారీ చేశారు.
 అదే విధంగా మంథూర్, అనాజీపూర్ గ్రామాలను దౌల్తాబాద్ మండలం నుంచి తొలగించి, చేగుంట మండలం పరిధిలోకి మార్చినట్లు ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ మేరకు నవంబర్ 1న జిల్లా గెజిట్‌లో తుది ప్రకటన జారీ చేయాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. దుబ్బాక ఎమ్మెల్యే చెరుకు ముత్యం రెడ్డి ఈ మార్పులను ప్రతిపాదించడమే కాక.. పట్టుబట్టి సాధించుకున్నట్లు చర్చ జరుగుతోంది.
 

Advertisement
 
Advertisement
Advertisement