పోలవరంలో ఎన్‌జీటీ సభ్యుల పర్యటన

NGT Committee Members Visits Waste Dumping Near Polavaram Project - Sakshi

సాక్షి, పశ్చిమ గోదావరి: సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌(ఎన్‌జీటీ) కమిటీ సభ్యులు పోలవరం ప్రాజెక్టు మట్టి డంపింగ్‌ ప్రదేశాలను గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు గ్రామస్తులు, అధికారులతో సమావేశమయ్యారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వ్యర్థాలను, తవ్విన మట్టిని ఎక్కడబడితే అక్కడ డంపింగ్‌ చేయడం వల్ల పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందని ఎన్‌జీటీకి ఫిర్యాదు వెళ్లింది. మే 10వ తేదీన ఈ అంశంపై సుప్రీం కోర్టులో విచారణ జరగనున్న నేపథ్యంలో ఎన్‌జీటీ కమిటీ సభ్యులు పోలవరం డంపింగ్‌ ప్రాంతంలో పర్యటించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top