మళ్లీ ఒకే వేదికపై చంద్రబాబు, కేసీఆర్ | narasimhan invites chandra babu, kcr for Presidents party | Sakshi
Sakshi News home page

మళ్లీ ఒకే వేదికపై చంద్రబాబు, కేసీఆర్

Jun 29 2015 6:15 PM | Updated on Aug 24 2018 2:01 PM

మళ్లీ ఒకే వేదికపై చంద్రబాబు, కేసీఆర్ - Sakshi

మళ్లీ ఒకే వేదికపై చంద్రబాబు, కేసీఆర్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, కే చంద్రశేఖర్ రావు ఒకే వేదికపై దర్శనమివ్వనున్నారు.

హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసు అనంతరం ఘర్షణాత్మక వైఖరి అవలంభించిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, కే చంద్రశేఖర్ రావు ఒకే వేదికపై దర్శనమివ్వనున్నారు. ఉభయ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్.. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గౌరవార్థం ఇచ్చే విందు ఇందుకు వేదిక కానుంది.

మంగళవారం సాయంత్రం రాజ్భవన్లో గవర్నర్ రాష్ట్రపతికి విందు ఏర్పాటు చేశారు. ఈ విందుకు రావాల్సిందిగా నరసింహన్ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆహ్వానించారు. ఓటుకు కోట్లు కేసు అనంతరం తీవ్ర ఆరోపణలు చేసుకున్న చంద్రబాబు, కేసీఆర్ ఒకే వేదికపైకి రానుండటం ప్రాధన్యం ఏర్పడింది. రాష్ట్రపతి తాత్కాలిక విడిది కోసం ఈ రోజు ఉదయం హైదరాబాద్ వచ్చిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement