కేసీఆర్పై సెటైర్లు వేసిన నారా లోకేష్ | Nara lokesh setairs on kcr | Sakshi
Sakshi News home page

కేసీఆర్పై సెటైర్లు వేసిన నారా లోకేష్

Aug 7 2014 1:40 PM | Updated on Aug 29 2018 3:37 PM

కేసీఆర్పై సెటైర్లు వేసిన నారా లోకేష్ - Sakshi

కేసీఆర్పై సెటైర్లు వేసిన నారా లోకేష్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై టీడీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ సెటైర్లు విసిరారు.

విజయవాడ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై టీడీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి  చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ సెటైర్లు విసిరారు. ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి అంటే ఏమిటో త్వరలోనే చూపిస్తామని లోకేష్ గురువారమిక్కడ వ్యాఖ్యానించారు. అప్పుడు ఆంధ్రప్రదేశ్తో పోటీ పడాలని ఆయన సవాల్ విసిరారు.

కృష్ణాజిల్లా నూజివీడు మండలం నర్సపూడిలో నారా లోకేష్  సోలర్ విద్యుత్ ప్లాంట్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమను విమర్శించటం కాదని, ముందు హైదరాబాద్లో కోతలు లేకుండా కరెంట్ ఇవ్వాలని ఎద్దేవా చేశారు. మరోవైపు చంద్రబాబు నాయుడు బెజవాడలో తొలిసారిగా జిల్లా కలెక్టర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement