
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌లో విస్తృత పరీక్షలు నిర్వహించడం వల్ల కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా వస్తున్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎక్కువ కరోనా పరీక్షలు చేయడం ద్వారా విస్తృత వ్యాప్తిని నిరోధించవచ్చని పేర్కొన్నారు.
మరోవైపు ఏపీలో కరోనా మరణ మృదంగం లాంటి దుష్ప్రచారం చేయడం తగదని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు తెలిపారు. దేశంలోనే అత్యధిక కరోనా పరీక్షలు ఏపీలోనే జరుగుతున్నాయని, ఇప్పటి వరకు రాష్ట్రంలో 12 లక్షల కోవిడ్ పరీక్షలు జరిగాయని పేర్కొన్నారు.