విశాఖ జిల్లా చోడవరం మండలంలోని ప్రభుత్వ భూములు కబ్జాకు గురవడం పట్ల స్థానిక ఎమ్మెల్యే కె. ఎస్.ఎన్.ఎస్ రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు.
చోడవరం : విశాఖ జిల్లా చోడవరం మండలంలోని ప్రభుత్వ భూములు కబ్జాకు గురవడం పట్ల స్థానిక ఎమ్మెల్యే కె. ఎస్.ఎన్.ఎస్ రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం మండల పర్యటనలో భాగంగా ఆయన చోడవరంలో పలు ప్రాంతాలను సందర్శించారు. కబ్జాకు గురైన భూముల వివరాలు వెంటనే నిగ్గుతేల్చాలని తహశీల్దార్‌ను ఆదేశించారు.