విశాఖ స్టీల్ప్లాంట్ ప్లాగ్ యార్డులో కూలిన స్లాబ్ | Metal Fabrication Plant building slab collapse in Visakha Steel plant | Sakshi
Sakshi News home page

విశాఖ స్టీల్ప్లాంట్ ప్లాగ్ యార్డులో కూలిన స్లాబ్

Oct 23 2013 8:56 AM | Updated on Sep 1 2017 11:54 PM

విశాఖ స్టీల్ ప్లాంట్లో బుధవారం ప్రమాదం జరిగింది. కర్మాగారంలోని ఎస్ఎంఎస్ ప్లాగ్ యార్డు పైకప్పు హఠాత్తుగా కూలిపోయింది.

విశాఖ : విశాఖ స్టీల్ ప్లాంట్లో బుధవారం ప్రమాదం జరిగింది. కర్మాగారంలోని ఎస్ఎంఎస్ భవనంలోని ప్లాగ్ యార్డు పైకప్పు హఠాత్తుగా కూలిపోయింది. అయితే ఆ సమయంలో అక్కడ కార్మికులు ఎవరూ లేకపోవటంతో ప్రమాదం తప్పింది. దీంతో ఉత్పత్తి నిలిచిపోయింది. భారీ వర్షాల కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు కార్మికులు తెలిపారు. మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం కారణంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. యలమంచిలిలో చెరువుకు గండి పడటంతో పలు ప్రాంతాలు నీట మునిగాయి.

Advertisement
 
Advertisement
Advertisement