మహిళలపై నేరాలను అరికడతాం : హోంమంత్రి

Mekathoti Sucharitha Speech In Collector Conference - Sakshi

సాక్షి, విజయవాడ : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన జిల్లా కలెక్టర్ల రెండో రోజు సదస్సు మంగళవారం ఉదయం ప్రారంభమైంది. ఈ సదస్సులో రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత మాట్లాడుతూ.. పారదర్శకత, నిష్పక్షపాతంగా వ్యవహరించడమే తమ ప్రభుత్వ ధ్యేయమని అన్నారు. బడుగు బలహీన, మైనార్టీ, సాధారణ ప్రజలకు పోలీసుల పట్ల విశ్వాసం పెంచడానికి గ్రామాల్లో ప్రజాదర్బార్‌ నిర్వహిస్తామని తెలిపారు. 

విధి నిర్వహణలో ఒత్తిడి లేకుండా ఉండేందుకు వీక్లీఆఫ్‌లను కల్పించామని పేర్కొన్నారు. మహిళలపై నేరాలను అరికడతామని హామీ ఇచ్చారు. నిరుద్యోగ సమస్యను తగ్గించేందుకు పోలీస్‌ శాఖలో ఖాళీలను భర్తీ చేస్తామని అన్నారు. వాహనదారులకు నియమ నిబంధనలపై అవగాహన కల్పిస్తామని అన్నారు. యువత మాదకద్రవ్యాల బారిన పడకుండా అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. విద్యాసంస్థల్లో ర్యాగింగ్‌ నిరోధక చట్టాన్ని అమలు చేస్తామని తెలిపారు. (చదవండి: పాలకులం కాదు.. సేవకులం)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top