సమస్యలుంటే 104కి కాల్ చేయండి: జవహర్‌రెడ్డి

Medical Health Department Special CS Jawahar Reddy Release Health Bulletin - Sakshi

ఏపీలో కరోనాపై హెల్త్ బులెటిన్ విడుదల 

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కరోనావైరస్‌పై హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. రాష్ట్రంలో ఆదివారం కరోనా కేసు నమోదు కాలేదని వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్‌ సీఎస్‌ జవహర్‌ రెడ్డి తెలిపారు. ఏపీలో ఇప్పటివరకూ 19 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయని, ఇప్పటివరకూ 512  మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, వారిలో 433 మందికి నెగిటివ్‌గా నిర్థారణ అయినట్లు చెప్పారు. ఇంకా 60 కేసుల పరీక్షల ఫలితాలు రావాల్సి ఉందన్నారు. (రేషన్‌ పంపిణీతో ఏపీ ప్రజలకు ఊరట)

అలాగే విదేశాల నుంచి వచ్చినవారు స్వీయ నిర్బంధం పాటించాలని జవహర్‌రెడ్డి కోరారు. ‘మీ ఆరోగ్యం, మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని.. మీ ఇంటి వద్దే ఆరోగ్య బృందం పరీక్షిస్తుంది, సహకరించండి. ఎవరైనా దగ్గు, జలుబు, ఊపిరి పీల్చుకోవడం వంటి సమస్యలు ఉంటే 104కి కాల్‌ చేయండి’  అని ఆయన సూచించారు. కాగా ఏపీలో శనివారం ఒక్కరోజే మరో ఆరు కరోనా వైరస్‌ (కోవిడ్‌–19) పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 19కి చేరింది. (ప్రజలను క్షమాపణలు కోరిన ప్రధాని మోదీ)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top