రాజధానిపై ఏప్రిల్‌లో నిష్ణాతుల కమిటీ నివేదిక | Master committee report in April on Capital | Sakshi
Sakshi News home page

రాజధానిపై ఏప్రిల్‌లో నిష్ణాతుల కమిటీ నివేదిక

Mar 13 2017 2:43 AM | Updated on Aug 18 2018 6:18 PM

ఏపీ సంస్కృతి, చరిత్ర, వారసత్వ సంపదలను రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణంలో నిక్షిప్తం చేయడానికి ఏర్పాటైన ‘నిష్ణాతుల కమిటీ’ ఏప్రిల్‌ మొదటి

సాక్షి, అమరావతి: ఏపీ సంస్కృతి, చరిత్ర, వారసత్వ సంపదలను రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణంలో నిక్షిప్తం చేయడానికి ఏర్పాటైన ‘నిష్ణాతుల కమిటీ’ ఏప్రిల్‌ మొదటి వారంలోగా కసరత్తు పూర్తి చేయాలని నిర్ణయించింది. మలి విడత సమావేశాల్లో భాగంగా ఆదివారం సీఆర్‌డీఏ కార్యాలయంలో భేటీ అయిన ఈ కమిటీ పలు అంశాలపై చర్చించింది. ఎవరెవరు ఏయే బాధ్యతలను గడువులోగా పూర్తి చేయాలో కమిటీ నిర్ణయించింది.

ఈ నెలాఖరులోపు కుడ్యాలు, కూడళ్లు, భవంతులు, ప్రాకారాల నమూనాలను వేర్వేరుగా వర్గీకరించి తుది ఆకృతులకు దృశ్య రూపకల్పన చేసే బాధ్యతను ప్రముఖ సినీ ఆర్డ్‌ డైరెక్టర్‌ ఆనంద్‌సాయికి అప్పగించింది. కమిటీ చేసే సూచనలు, సలహాలను అమరావతి నగర రూపశిల్పిగా ఉన్న నార్మన్‌ పోస్టర్‌ సంస్థకు త్వరలో అందించాల్సి ఉందని కమిటీ సారథి పరకాల ప్రభాకర్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement