బైక్‌పై రోడ్డు దాటుతున్న ఓ వ్యక్తిని వేగంగా వచ్చిన కారు ఢీకొనటంతో అతడి ప్రాణం అక్కడికక్కడే అనంతవాయువుల్లో కలిసిపోయింది.
నకిరేకల్లు (గుంటూరు) : బైక్‌పై రోడ్డు దాటుతున్న ఓ వ్యక్తిని వేగంగా వచ్చిన కారు ఢీకొనటంతో అతడి ప్రాణం అక్కడికక్కడే అనంతవాయువుల్లో కలిసిపోయింది. గుంటూరు జిల్లా నకిరేకల్లు సమీపంలో శనివారం సాయంత్రం 6 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. నకిరేకల్లు పట్టణానికి చెందిన మస్తాన్(30) స్థానికంగా ఉన్న రైస్ మిల్లు కూలీగా పనిచేస్తుంటాడు.
కాగా అతడు శనివారం సాయంత్రం బైక్‌పై అద్దంకి- నార్కట్‌పల్లి రహదారిని క్రాస్ చేస్తుండగా పిడుగురాళ్ల వైపు వెళ్తున్న కారు వేగంగా వచ్చి ఢీకొంది. దీంతో మస్తాన్ ఎగిరి కారుపై పడ్డాడు. ఆ ధాటికి అతడు అక్కడికక్కడే చనిపోయాడు. కాగా మస్తాన్‌కు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. ఈ మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.