తక్కువ చార్జీలు.. మెరుగైన సేవలు | Low charges better services .. | Sakshi
Sakshi News home page

తక్కువ చార్జీలు.. మెరుగైన సేవలు

Jun 17 2014 1:33 AM | Updated on Sep 18 2018 8:19 PM

హైదరాబాద్: పోస్టల్ ట్రాన్స్‌పోర్టు ద్వారా వస్తువులతో పాటు కూరగాయల రవాణాకూ వెసులుబాటు కల్పించామని ఆంధ్రప్రదేశ్ సర్కిల్ చీఫ్ పోస్టుమాస్టర్ జనరల్ బీవీ సుధాకర్ వెల్లడించారు.

పోస్టల్ ట్రాన్స్‌పోర్టు సేవలు ప్రారంభం  వస్తువులతో పాటు కూరగాయల రవాణా
 
హైదరాబాద్: పోస్టల్ ట్రాన్స్‌పోర్టు ద్వారా వస్తువులతో పాటు కూరగాయల రవాణాకూ వెసులుబాటు కల్పించామని ఆంధ్రప్రదేశ్ సర్కిల్ చీఫ్ పోస్టుమాస్టర్ జనరల్ బీవీ సుధాకర్ వెల్లడించారు. సోమవారం హైదరాబాద్‌లోని జనరల్ పోస్టు కార్యాలయంలో పోస్టల్ ట్రాన్స్‌పోర్టు వాహనాలను ప్రారంభించారు. అనంతరం విలేకరులతో మాట్లాడు తూ, ప్రైవేటు రవాణా సంస్థల కంటే తక్కువ చార్జీలతోపాటు డోర్ డెలివరీతో మెరుైగె న సేవలందిస్తామన్నారు. ప్రాథమికంగా ఈ సేవలను నాలుగు ప్రధాన రూట్లలో ప్రారంభిస్తున్నామని, డిమాండ్‌ను బట్టి త్వరలో గ్రామీణ ప్రాంతాలకూ విస్తరిస్తామని చెప్పారు. రోజూ హైదరాబాద్ నుంచి మూడు రూట్లు, విజయవాడ నుంచి ఒక రూట్‌లో పోస్టల్ రవాణా సేవలు అందించేలా అప్ అండ్ డౌన్‌కు ప్రత్యేకంగా ఎనిమిది కార్గో వాహనాలను వినియోగిస్తున్నట్లు ఆయన తెలిపారు.

ప్రతి రూట్ మార్గమధ్యలో సైతం ట్రాన్స్‌పోర్టు గూడ్స్ సేకరణ, డెలివరీ సేవలు ఉంటాయని వివరించారు. వస్తువు బరువును బట్టి కిలోమీటరు చొప్పున చార్జీలు ఉంటాయన్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో పోస్టల్ శాఖను తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ సర్కిళ్లుగా విభజించేందుకు కేంద్రశాఖకు ప్రతిపాదనలు పంపించామన్నారు. పోస్టల్ శాఖను విభజిస్తే తెలంగాణలో 7 వేల పోస్టాఫీసులు, ఆంధ్రప్రదేశ్ సర్కిల్‌లో 9 వేల పోస్టాఫీసులు ఉంటాయన్నారు.  రాష్ర్టంలో మరో 11 కొత్త పోస్టాఫీసులను త్వరలో ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement