శ్రీకాకుళం రైతులకు ఉద్యాన పాఠాలు | Lessons horticulture farmers in Srikakulam | Sakshi
Sakshi News home page

శ్రీకాకుళం రైతులకు ఉద్యాన పాఠాలు

Jun 12 2015 12:21 AM | Updated on Sep 3 2017 3:35 AM

ఉద్యాన వనంలో రకరకాల మొక్కలను చూసి ఆ రైతులంతా పులకించారు. కొత్తరకాల మొక్కలను తాకి ఆనందం పొందారు.

 తాడేపల్లిగూడెం : ఉద్యాన వనంలో రకరకాల మొక్కలను చూసి ఆ రైతులంతా పులకించారు. కొత్తరకాల మొక్కలను తాకి ఆనందం పొందారు. శాస్త్రవేత్తలు చెప్పిన పాఠాలను ఆసక్తిగా విన్నారు. తమకు తెలియని విషయాలను శ్రద్ధగా అడిగి తెలుసుకున్నారు. శ్రీకాకుళం జిల్లా రణస్థలం, లావేరు, నరసన్నపేట, పాలకొండ, వీరఘట్టం, పాతపట్నం, బూర్జ, ఆముదాలవలస మండలాలకు చెందిన 160 మంది రైతులు బుధ, గురువారాలలో తాడేపల్లిగూడెం మండలం వెంకట్రామన్నగూడెంలోని డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయాన్ని సందర్శించారు. కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డాక్టర్ ఇ.కరుణశ్రీ, ఉద్యాన పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ రవీం ద్రబాబు, శాస్త్రవేత్త రమేష్‌బాబు ఉద్యాన పంటలపై రైతులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సీహెచ్.చంద్రశేఖరరావు, ఉద్యాన అధికారి టి.అమరేశ్వరి, జి.జ్యోత్స్న, కేవీకే శాస్త్రవేత్త సీహెచ్.కిరణ్‌కుమార్ పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement