దిశ పోలీస్‌స్టేషన్‌ ఏర్పాటుకు స్థల పరిశీలన

Land Observation For Disha Police Station Kakinada - Sakshi

తూర్పుగోదావరి, కాకినాడ క్రైం: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన దిశ చట్టం అమలులో భాగంగా కాకినాడ నగరంలో దిశ పోలీస్‌స్టేషన్‌ ఏర్పాటుకు అవసరమైన చర్యలు చేపడుతున్నామని జిల్లా ఎస్పీ అద్నాన్‌ నయీం అస్మీ తెలిపారు. శుక్రవారం టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌ను ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దిశ చట్టం పకడ్బందీగా అమలు చేసేందుకు వీలుగా నగరంలో ప్రత్యేక దిశ పోలీస్‌స్టేషన్‌ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. దీనికి అవసరమైన విధంగా నగరంలోని కొన్ని పోలీస్‌స్టేషన్లతో పాటు, మరికొన్ని ఖాళీ స్థలాలను పరిశీలించామన్నారు. దిశ పోలీస్‌స్టేషన్‌లో అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించనున్నట్టు తెలిపారు. కలెక్టరేట్‌ ప్రాంతం ఉన్న స్థలాన్ని, డీఎస్పీ కార్యాలయం, త్రీటౌన్, టూటౌన్, మహిళా పోలీస్‌స్టేషన్, ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌–2ను ఎస్పీ అద్నాన్‌ నయీం అస్మీ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయా స్టేషన్ల సీఐలు, ఎస్సైలతో ఆయన సమీక్షించారు. ఎస్పీతో పాటు ఈ తనిఖీల్లో డీఎస్పీలు కరణం కుమార్, సుంకర మురళీమోహనరావు తదితరులు ఉన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top