రాష్ట్ర విభజన అనంతరం ఏర్పాటుచేసిన కలెక్టర్ల సదస్సులో ప్రభుత్వం ఏడుమిషన్లతో ముందుకు సాగుతున్నట్లు ప్రకటించింది.
- విజయవాడ కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు సాక్షి, కర్నూలు: కర్నూలు కార్పొరేషన్‌నుస్మార్‌ట సిటీగా అభివృద్ధి చేయనున్నట్లుముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుస్పష్టం చేశారు. గురువారం విజయవాడలోకలెక్టర్ల సదస్సులో ఆయన మాట్లాడుతూరాయలసీమలో వెనుకబడిన జిల్లా కర్నూలులో తుంపర, బిందు సేద్యం పథకాలనుప్రోత్సహించి ఉద్యాన పంటలను మెరుగుపరుచుకోవాలని కలెక్టర్ విజయమోహన్‌కుదిశానిర్దేశం చేశారు. దీంతో జిల్లా అభివృద్ధికిఅడుగులు పడతాయని ప్రజలు భావిస్తున్నారు.
రాష్ట్ర విభజన అనంతరం ఏర్పాటుచేసిన కలెక్టర్ల సదస్సులో ప్రభుత్వం ఏడుమిషన్లతో ముందుకు సాగుతున్నట్లు ప్రకటించింది. వీటిలో ప్రాథమిక, సామాజిక,నైపుణ్యం/విజ్ఞాన రంగాలు, సేవలు,పారిశ్రామిక, మౌలిక వసతులు, పట్టణరంగాలపై భవిష్యత్తు కార్యాచరణ ఈ సదస్సులో ప్రకటించింది. కర్నూలు నగరాన్నిస్మార్ట్‌సిటీగా అభివృద్ధి చేస్తే.. యువతకుఉపాధి, పట్టణ ప్రజలకు మెరుగైన సౌకర్యాలు లభిస్తాయి. నగరంతోపాటు చుట్టుపక్కల ప్రాంతాలు సైతం అభివృద్ధి చెందుతాయి.
ఫలితంగా పట్టణాలకు గ్రామీణప్రాంతాల నుంచి వచ్చే వారందరికీ మెరుగైన వసతి, ఉపాధి అవకాశాలు అందుతాయి. ఆర్థికంగా అభివృద్ధి ఉంటుంది. ఐటీఆధారిత సేవలు మెరుగవుతాయి. మెరుగైనరవాణా ఉంటుంది. కార్యక్రమానికి జిల్లాకలెక్టర్ సీహెచ్ విజయమోహన్, ఎస్పీ ఆకెరవికృష్ణ హాజరయ్యారు. జిల్లాలో ప్రధానంగా ఎదురవుతున్న సవాళ్లు, సమస్యలు,అభివృద్ధికి చేపట్టాల్సిన కార్యక్రమాలనుముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు.