వైఎస్సార్‌ సీపీ వాణిజ్య విభాగం అధ్యక్షుడిగా కుప్పం ప్రసాద్‌ | Kuppam Prasad as YSRCP Commercial Section President | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ సీపీ వాణిజ్య విభాగం అధ్యక్షుడిగా కుప్పం ప్రసాద్‌

May 25 2017 1:05 AM | Updated on May 25 2018 9:20 PM

వైఎస్సార్‌ సీపీ వాణిజ్య విభాగం అధ్యక్షుడిగా కుప్పం ప్రసాద్‌ - Sakshi

వైఎస్సార్‌ సీపీ వాణిజ్య విభాగం అధ్యక్షుడిగా కుప్పం ప్రసాద్‌

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షునిగా ప్రకాశం జిల్లాకు చెందిన కుప్పం ప్రసాద్‌ నియమితులయ్యారు.

సాక్షి, హైదరాబాద్‌: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షునిగా ప్రకాశం జిల్లాకు చెందిన కుప్పం ప్రసాద్‌ నియమితులయ్యారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకం జరిగినట్లు కేంద్ర కార్యాలయం నుంచి బుధవారం రాత్రి విడుదలైన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

ఆయన వాసవీ సేవాదళ్‌ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా కూడా సమర్థంగా గతంలో సేవలందించారు. రాష్ట్రంలోని వాణిజ్య వర్గాల్లో పార్టీ పటిష్టతకోసం కృషి చేస్తానని, 2019 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ గెలుపే ఏకైక లక్ష్యంగా పాటుపడతానని ఆయన పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement