జగన్ రాకతో కుప్పం జనసంద్రమైంది. రహదారులన్నీ జనంతో నిండిపోయాయి. పెద్దాచిన్న, యువకులు, వృద్ధులు అన్న తేడా లేకుండా అందరూ రోడ్లపైకి వచ్చి జగన్‌కు స్వాగతం పలికారు.
సాక్షి ప్రతినిధి, తిరుపతి: జగన్ రాకతో కుప్పం జనసంద్రమైంది. రహదారులన్నీ జనంతో నిండిపోయాయి. పెద్దాచిన్న, యువకులు, వృద్ధులు అన్న తేడా లేకుండా అందరూ రోడ్లపైకి వచ్చి జగన్‌కు స్వాగతం పలికారు. కుప్పం నియోజకవర్గంలో ఆదివారం రెండోరోజు జగన్ చేపట్టిన సమైక్య శం ఖారావం యాత్రకు అపూర్వ స్పందన లభించింది. ప్రజలు అడుగడుగునా ఘనస్వాగతం పలుకుతూ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని విన్నవించారు. కుప్పం ఆర్‌అండ్‌బీ అతిథిగృహం నుంచి ఆదివారం ఉదయం తొమ్మిదిన్నర గంటలకు ప్రారంభమైన యాత్ర శాంతిపురం, రామకుప్పం మండలాల్లోని 20కి పైగా గ్రామాల మీదుగా పలమనేరు నియోజకవర్గంలోని వెంకటగిరి కోట వరకూ సాగింది.
శాంతిపురం, రామకుప్పం మండల కేంద్రాల్లో జగన్.. వైఎస్సార్ విగ్రహాలను ఆవిష్కరించి ప్రసంగించారు. జనం అడుగడుగునా స్వాగతం పలకడంతో వి.కోటలో మధ్యాహ్నం 2 కు జరగాల్సిన సభ రాత్రి 8 గంటలకు జరిగింది. అనంతరం జగన్ రాత్రి బస కోసం దగ్గర్లోని పట్రాపల్లెలో ఉన్న పార్టీ నేత వాసు ఇంటికి వెళ్లారు. జగన్ వెంట యాత్రలో పాల్గొన్న నేతల్లో జిల్లా పార్టీ కన్వీనర్ నారాయణస్వామి, ఎమ్మెల్యేలు భూమన కరుణాకరరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి, కొరుముట్ల శ్రీనివాసులు, తాజా మాజీ ఎమ్మెల్యేలు ఎన్.అమరనాథ్‌రెడ్డి, ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్సీ దేశాయి తిప్పారెడ్డి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సమన్వయకర్త తలశిల రఘురాం, పార్టీ నాయకులు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, ఎం.సుబ్రమణ్యంరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, రోజా తదితరులు ఉన్నారు.