పోలవరంపై శ్వేతపత్రం: కొత్తపల్లి డిమాండ్ | Kothapalli demand for White Paper on Polavaram Project | Sakshi
Sakshi News home page

పోలవరంపై శ్వేతపత్రం: కొత్తపల్లి డిమాండ్

May 19 2015 8:18 PM | Updated on Aug 21 2018 8:34 PM

కొత్తపల్లి సుబ్బరాయుడు - Sakshi

కొత్తపల్లి సుబ్బరాయుడు

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏడాది పాలనలో పోలవరం ప్రాజెక్టు పనులకు ఏ మేరకు నిధులు ఖర్చు చేశారో ఒక శ్వేతపత్రం విడుదల చేయాలని వైఎస్ఆర్ సీపీ సీనియర్ నేత కొత్తపల్లి సుబ్బారాయుడు డిమాండ్ చేశారు.

ఏలూరు: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏడాది పాలనలో పోలవరం ప్రాజెక్టు పనులకు ఏ మేరకు నిధులు ఖర్చు చేశారో ఒక శ్వేతపత్రం విడుదల చేయాలని వైఎస్ఆర్ సీపీ సీనియర్ నేత కొత్తపల్లి సుబ్బారాయుడు డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టు ధైర్యంగా శంకుస్థాపన చేసి, నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసిన ఘనత దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డిదేనని ఆయన అన్నారు. చంద్రబాబు ఏడాది పాలనలో ప్రజలకు ఒరిగింది ఏమీలేదన్నారు.

పోలవరంపై చంద్రబాబుది కపట ప్రేమ అన్నారు. ఏపీ శాసనసభ ప్రతిపక్ష నేత, తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆందోళనకు భయపడే కంటితుడుపు చర్యగా చంద్రబాబు కేంద్ర మంత్రి ఉమాభారతిని కలిశారని చెప్పారు. అయితే ఆమె నుంచి నిర్ధిష్టమైన హామీ రాలేదన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement