కరోనా పరీక్షల కోసం ప్రత్యేక బస్సు | Kodali Venkateswara Rao Arranges Special Bus For Coronavirus Test At Gudivada | Sakshi
Sakshi News home page

కరోనా పరీక్షల కోసం ప్రత్యేక బస్సు: కొడాలి నాని

Jul 15 2020 7:58 AM | Updated on Jul 15 2020 8:30 AM

Kodali Venkateswara Rao Arranges Special Bus For Coronavirus Test At Gudivada - Sakshi

సాక్షి, కృష్ణా: గుడివాడ పట్టణంలో కరోనా పరీక్షలు చేసేందుకు బుధవారం ఉదయం ప్రత్యేక బస్సు రానున్నట్లు రాష్ట్ర పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి వెంకటేశ్వ రావు(కొడాలి నాని) తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంటాక్ట్‌ ట్రేసింగ్‌ చేయడానికి ఈ ప్రత్యేక బస్సు ద్వారా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఏ ప్రాంతంలో బస్సును ఉంచి పరీక్షలు చేయాలనే దానిపై వైద్యుల సలహాలను తీసుకుంటున్నామన్నారు. కరోనా పాజిటివ్‌గా తేలిన వారు ఆలస్యంగా ఆస్పత్రులకు వస్తున్నారని.. ఫలితంగా కేసుల సంఖ్య పెరుగుతుందని అన్నారు. కరోనా మరణాలు తగ్గించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు. వైరస్‌ లక్షణాలు ఉన్న వారు కోవిడ్‌-19 పరీక్షలు చేయించుకునేందుకు సిద్ధం కావాలని కోరారు. సామాజిక దూరం పాటించి కరోనా పరీక్షలకు సహకరించాలన్నారు కొడాలి నాని.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement