మూడు ప్రాంతాలకు సమన్యాయం చేయాలి | Justice to be done for three regions | Sakshi
Sakshi News home page

మూడు ప్రాంతాలకు సమన్యాయం చేయాలి

Dec 15 2013 3:45 AM | Updated on Sep 2 2017 1:36 AM

రాష్ట్ర విభజన అనివార్యమైతే నీటి పంపిణీ విషయంలో మూడు ప్రాంతాలకు సమ న్యాయం చేయాలని రాష్ట్ర పౌరహక్కుల సంఘం కన్వీనర్ ప్రొఫెసర్ శేషయ్య డిమాండ్ చేశారు.

 పోతిరెడ్డిపాడు, హంద్రీనీవాలను పరిశీలించిన పౌరహక్కుల సంఘం కమిటీ

 జూపాడుబంగ్లా, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజన అనివార్యమైతే నీటి పంపిణీ విషయంలో మూడు ప్రాంతాలకు సమ న్యాయం చేయాలని రాష్ట్ర పౌరహక్కుల సంఘం కన్వీనర్ ప్రొఫెసర్ శేషయ్య డిమాండ్ చేశారు. శనివారం పౌర హక్కుల సంఘం తెలంగాణ, రాయలసీమ, కోస్తాంధ్రకు చెందిన సభ్యులు కర్నూలు జిల్లాలోని హంద్రీనీవా ప్రాజెక్టు, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా శేషయ్య మాట్లాడుతూ నీటి వనరుల పంపిణీలో కరువు ప్రాంతాలకు తొలుత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. సంఘం ఉపాధ్యక్షుడు ప్రొఫెసర్ లక్ష్మణ్ మాట్లాడుతూ సముద్రం పాలవుతున్న మిగులు జలాల సద్వినియోగంపై దృష్టి సారించాలన్నారు. పులిచింతల ప్రాజెక్టుతో నల్గొండ జిల్లాలోని కొన్ని ప్రాంతాలను ముంపునకు గురిచేసి కోస్తాంధ్రకు నీటిని తరలించడం భావ్యం కాదన్నారు. స్వాతంత్య్రం రాకముందు ప్రారంభించిన ఇచ్చంపల్లి ప్రాజెక్టును ఇప్పటికీ పూర్తి చేయకపోవడం పట్ల ఆయన అసహనం వ్యక్తం చేశారు.

గోదావరి జలాలను సద్వినియోగం చేసుకుంటే రాష్ట్రం సస్యశ్యామలం అవుతందన్నారు. హంద్రీనీవా ప్రాజెక్టు వ్యయం ఎక్కువే అయినా.. ప్రయోజనం తక్కువగా ఉందన్నారు. పౌరహ క్కుల సంఘం సహాయ కార్యదర్శి శ్రీమన్నారాయణ మాట్లాడుతూ ఏటా సముద్రం పాలవుతున్న నీటిని సద్వినియోగం చేసుకునేందుకు గోదావరి, కృష్ణా నదులపై కొత్త ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాలని కోరారు. పోలవరం ప్రాజెక్టుతో 273 కుటుంబాలకు చెందిన 3 ల క్షల మంది నిరాశ్రయులవుతుండగా.. వారికి ఎలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టకనే నిర్మాణానికి పూనుకోవడం సమంజసం కాదన్నారు. రాయలసీమ జేఏసీ కన్వీనర్ సోమశేఖరశర్మ మాట్లాడుతూ రాష్ట్రాన్ని విడదీస్తే ప్రత్యేక రాయలసీమతోపాటు శ్రీభాగ్ ఒడంబడిక ప్రకారం ఈ ప్రాంతానికి నీటి వనరులు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర పౌరహక్కుల సంఘం సభ్యులు డాక్టరు లక్ష్మణ్, రిటైర్డ్ ఇంజినీర్ సుబ్బరాయుడు, ఖరీం భాష, అల్లాబకాష్, బీసీ రాష ్టస్రంక్షేమ సంఘం ప్రధానకార్యదర్శి నక్కలమిట్ట శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement