త్వరలో సాగునీటి సంఘాలకు ఎన్నికలు | Irrigation unions elections shortly | Sakshi
Sakshi News home page

త్వరలో సాగునీటి సంఘాలకు ఎన్నికలు

Sep 29 2013 3:14 AM | Updated on Sep 1 2017 11:08 PM

జిల్లాలోని సాగునీటి సంఘాలకు త్వరలో ఎన్నికలు జరుగనున్నాయి.

ఖమ్మం అర్బన్, న్యూస్‌లైన్: జిల్లాలోని సాగునీటి సంఘాలకు త్వర లో ఎన్నికలు జరుగనున్నాయి. వచ్చే నెల రెండో వారంలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుందని, దీని కోసం సర్వం సిద్ధం చేసుకోవాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చా యి. ఈ మేరకు ఇరిగేషన్, రెవెన్యూ శాఖల అధికారులు జాబితా తయారీలో నిమగ్నమయ్యా రు. జిల్లా వ్యాప్తంగా మేజర్, మీడియం. మైనర్ ఇరిగేషన్ పరిధిలో 498 నీటి సంఘాలు ఉన్నా యి. వీటన్నింటికి 2010లో పదవీకాలం ము గిసినప్పటికీ ప్రభుత్వం రెండు సంవత్సరాలు గా ఆ కమిటీలనే కొనసాగించుకుంటూ వచ్చిం ది. ఈ ఏడాది జనవరిలో నీటి సంఘాలను రద్దు చేసి సంబంధిత ఇంజనీరింగ్ అధికారుల ను ప్రత్యేకాధికారులుగా నియమించారు. ఇప్పటికే పదవీకాలం పూర్తయిన తర్వాత రెండు సంవత్సరాల పాటు అదే కమిటీలను కొనసాగించారు. అనంతరం మరో ఏడాది ప్రత్యేకాధికారులతో నెట్టుకు వచ్చారు. దీంతో నీటి పంపి ణీ సంఘాల పరిధిలో వివిధ అభివృద్ధి పనుల ను అధికారులు ఇష్టారాజ్యంగా చేపట్టారు.  
 
 ఆయకట్టు రైతుల్లో సంబరాలు...
 నీటిసంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఆయకట్టు రైతుల్లో సంబరాలు మొదలయ్యా యి. ఒక్కొక్క నీటి సంఘానికి 12 మంది టీసీలతో సంఘం ఏర్పడుతుంది. 12టీసీల్లో నాలు గు టీసీల పదవీకాలం 2014 జనవరితో ముగి యనుంది. మిగిలిన 8 టీసీల పదవీకాలం ముగియడంతో వీటికి ఎన్నికలు నిర్వహించి నీటి సంఘాల డిస్ట్రిబ్యూటరీ కమిటీలను ఎన్నుకోనున్నారు. జిలాలో ఎన్నెస్పీ పరిధిలో 79 నీటి సంఘాలకు, మీడియం ఇరిగేషన్‌లో 38 సంఘాలకు, మైనరు ఇరిగేషన్ పరిధిలో 381 సంఘాలకు ఎన్నికలు జరుగనున్నాయి. నీటి సంఘాల ఎన్నికలు పూర్తయిన తర్వాత డీసీల చైర్మన్‌లను ఎన్నుకోనున్నారు.
 
 ఈ నెల 31 నాటికి  ఓటర్ల జాబితాలు సిద్ధం చేయాలని శుక్రవారం జిల్లా జేసీ ఇరిగేషన్, రెవెన్యూ అధికారులను ఆదేశిం చారు. అక్టోబర్ రెండో వారంలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉం దని, ఈ లోగా సర్వం సిద్ధం చేసుకోవాలని సూ చించడంతో అధికారులు కసరత్తు మొదలుపెట్టారు. ఎన్నెస్పీ టేకులపల్లి సర్కిల్ పరిధిలో ఖమ్మం జిల్లాలో 78 సంఘాలు, నల్లగొండ జిల్లాలో ఐదు సంఘాలు, కృష్ణాజిల్లాలో 77 సంఘాలు, పశ్చిమగోదావరి జిల్లాలో రెండు సంఘాలు ఉన్నాయి. ఈ నీటి సంఘాల ద్వారా ఖమ్మం జిల్లాలో 9 డీసీలు, కృష్ణాజిల్లాలో 10 డీసీల కమిటీలను ఎన్నుకోవాల్సి ఉంటుంది.  సాగర్ ఎడమకాల్వ పరిధిలో 32 డీసీలకు ఎన్నికలు పూర్తి అయితే మెజార్టీ సభ్యులు ప్రాజెక్టు చైర్మన్‌ను ఎన్నుకుంటారు. ప్రాజెక్టు చైర్మన్ పదవి దక్కించుకునేందుకు ప్రధాన రాజకీయ పార్టీలు ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement