వామ్మో.. సీఎం పర్యటనా? | International Women's Day event | Sakshi
Sakshi News home page

వామ్మో.. సీఎం పర్యటనా?

Mar 8 2016 3:11 AM | Updated on Mar 3 2020 7:07 PM

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి పర్యటన..అధికారులకు ఆర్థిక భారంగా మారుతోంది.

నయా పైసా విదిల్చని ప్రభుత్వం
  బెంబేలెత్తుతున్న అధికారులు
కాంట్రాక్టర్లను బతిమాలుతున్న వైనం

 
కర్నూలు(హాస్పిటల్): ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి పర్యటన..అధికారులకు ఆర్థిక భారంగా మారుతోంది. సీఎం పర్యటన ఏర్పాట్లకు ప్రభుత్వం నిధులు విడుదల చేయడం లేదు. దీంతో అధికారులకు  కాంట్రాక్టర్లను బతిమాలుకొని పనులు చేయించుకోవాల్సి వస్తోంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు మంగళవారం సీఎం కర్నూలు వస్తున్నారు. వేదిక కర్నూలు ఔట్‌డోర్ స్టేడియంలో నిర్మించారు. ఇందుకు ప్రత్యేకించి ఎలాంటి బడ్జెట్ రాకపోవడంతో అధికారుల ఇబ్బందులు అన్ని ఇన్ని కావు. స్థానిక ఔట్‌డోర్ స్టేడియం చుట్టు పక్కలతో పాటు ఇతర ప్రాంతాల్లో  గుంతలు పడిన రోడ్లను పూడ్చడం వంటి పనులు చేపట్టారు.

ప్యాచ్ వర్కుల కోసం ఒక్కలోడ్ రూ. 25 వేల ప్రకారం మూడు రోజుల పాటు పనులు చేస్తున్నారు. వేదిక రూ. 4 లక్షలు ఖర్చు పెట్టి ఏర్పాట్లు చేశారు. ఈ పనులకు ఎలాంటి నిధులు లేకుండా కాంట్రాక్టర్లను బతిమాలి పనులు చేయించుకోవడం గమనార్హం. గతంలో 2014 ఆగష్టు 15 వేడుకలు కర్నూలులో నిర్వహించగా.. ఆర్‌అండ్‌బి శాఖకు రూ. 80 లక్షలు ఖర్చు వచ్చింది. అయితే ఏడాదిన్నరగా నిధులు విడుదల కాకపోవడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement