'రాష్ట్రాలు ఎన్నిఉన్నా సమైక్యత ముఖ్యం' | Integrity So Important: Jaya Prakash narayana | Sakshi
Sakshi News home page

'రాష్ట్రాలు ఎన్నిఉన్నా సమైక్యత ముఖ్యం'

Aug 10 2013 10:42 AM | Updated on Mar 9 2019 4:13 PM

'రాష్ట్రాలు ఎన్నిఉన్నా సమైక్యత ముఖ్యం' - Sakshi

'రాష్ట్రాలు ఎన్నిఉన్నా సమైక్యత ముఖ్యం'

రాష్ట్రాలు ఎన్ని ఉన్నా సమైక్యత ముఖ్యమని లోక్సత్తా జాతీయ అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ అన్నారు.

హైదరాబాద్ : రాష్ట్రాలు ఎన్ని ఉన్నా సమైక్యత ముఖ్యమని లోక్సత్తా జాతీయ అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ అన్నారు. లోక్సత్తా పార్టీ శనివారం హైదరాబాద్ జూబ్లీహాల్లో 26అంశాలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా జేపీ మాట్లాడుతూ సమస్యలకు పరిష్కారాలు ఉన్నాయని తెలుగు ప్రజలకు నమ్మకం కల్పించాలని అన్నారు.

గతాన్ని తవ్వకుండా భవిష్యత్ గురించి ఆలోచిద్దామని ఆయన పేర్కొన్నారు. ఆవేశాలు, వాదనలు లేకుండా అర్థవంతమైన చర్చలు జరపాలని ఆయన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నవారికి విజ్ఞప్తి చేశారు. ప్రజల మధ్య విభేదాలు లేకుండా చేయాలన్నదే తమ ఉద్దేశ్యమని జయప్రకాష్ నారాయణ తెలిపారు.  హైదరాబాద్ గురించి చర్చించాల్సిన అవసరం ఉందన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement