కొనసాగుతున్న అక్రమ నిర్మాణాల కూల్చివేత

Illegal Constructions Demolishing  In Tadepalligudem - Sakshi

సాక్షి, పశ్చిమ గోదావరి : అక్రమ నిర్మాణాల కూల్చివేతలో ఎటువంటి కనికరం ప్రదర్శించకూడదన్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఆదేశాలతో అధికారులు రంగంలోకి దిగారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో దేవాదాయ శాఖ భూముల ఆక్రమణలపై రెండవ రోజు  తొలగింపు ప్రక్రియ కొనసాగుతున్నాయి. నరసింహారావు పేటలోని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి గొర్రెల శ్రీధర్ ఆక్రమించిన స్థలాల్లోని రోడ్లూ, నిర్మాణాలు అధికారులు తొలగించారు.

నిన్న జెడ్పీ చైర్మన్ ముళ్ళపూడి బాపిరాజు, తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు ఆందోళన చేయటంతో కూల్చివేత పనులు మధ్యలోనే ఆపేసిన  సంగతి తెలిసిందే. అయితే ఇలాంటి ఘటనలు జరగకుంగా ముందస్తు జాగ్రత్తలు సిద్ధం చేసిన ఎండోమెంట్‌  అధికారులు భారీగా పోలీసు బలగాలను ఏర్పాటు చేశారు

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top