మోడల్‌ జిల్లాగా అభివృద్ధి చేస్తా: మంత్రి | I Will Develop East Godavari As Model District Said By Minister Pinepi Vishwaroop | Sakshi
Sakshi News home page

మోడల్‌ జిల్లాగా అభివృద్ధి చేస్తా: మంత్రి

Jun 16 2019 8:33 PM | Updated on Jun 16 2019 8:33 PM

I Will Develop East Godavari As Model District Said By Minister Pinepi Vishwaroop - Sakshi

మంత్రి పినిపే విశ్వరూప్‌(పాత చిత్రం)

తూర్పుగోదావరి జిల్లా: సాంఘిక సంక్షేమ శాఖా మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా మంత్రి పినేపి విశ్వరూప్‌ తూర్పుగోదావరి జిల్లాలో అడుగుపెట్టారు. జిల్లాకు చెందిన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే చిర్ల జగ్గి రెడ్డి, పార్టీ శ్రేణులు మంత్రికి ఘనస్వాగతం పలికారు. అనంతరం రావులపాలెం నుంచి అమలాపురం వరకు ర్యాలీగా మంత్రి బయలుదేరారు.

ఈ సందర్భంగా విశ్వరూప్‌ విలేకరులతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా సాంఘిక సంక్షేమ శాఖను నిర్వహిస్తానని తెలిపారు. సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్రంలోనే తూర్పుగోదావరి జిల్లాను మోడల్‌ జిల్లాను అభివృద్ధి చేస్తానని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement