దైవం పట్ల భయభక్తులు పెంపొందించాల్సిన పాఠశాల ఉపాధ్యాయుడు కామాంధుడయ్యాడు.
కడప కార్పొరేషన్/ చింతకొమ్మదిన్నె, న్యూస్‌లైన్ : దైవం పట్ల భయభక్తులు పెంపొందించాల్సిన పాఠశాల ఉపాధ్యాయుడు కామాంధుడయ్యాడు. పదేళ్ల బాలుడిపై లైంగిక దాడికి తెగబడ్డాడు. ఏడునెలలుగా ఈ వ్యవహారం సాగుతున్నా పాఠశాల యాజమాన్యం గుర్తించలేదు. శుక్రవారం బయటపడ్డాక అత్యాచారానికి పాల్పడ్డ వ్యక్తిని పోలీసులకు అప్పగించి చేతులు దులుపుకునే యత్నం చేసింది.
వివరాలిలా ఉన్నాయి. కడప నగర శివార్లలోని శాటిలైట్ టౌన్‌షిప్‌కు చెందిన రహమతుల్లాఖాన్, యాస్మిన్ దంపతులకు ఇద్దరు కుమారులు. వారిరువురిని చింతకొమ్మదిన్నె మండలం బుగ్గలేటిపల్లె సమీపంలోని పాఠశాలలో చేర్చారు. వీరిలో పెద్ద పిల్లాడిపై ముక్రం అనే ఉపాధ్యాయుడు ఏడు మాసాలుగా లైంగిక దాడి చేస్తున్నాడు. ఈ విషయం గుర్తించిన అతని తమ్ముడు తల్లిదండ్రులకు చెప్పడంతో విషయం బయటికి పొక్కింది. దీన్ని బయటికి రాకుండా చేసేందుకు పాఠశాల పెద్దలు శతవిధాల ప్రయత్నించినప్పటికీ సాధ్యం కాలేదు. చివరికి వారే అత్యాచారానికి పాల్పడిన ముక్రంను పోలీసుస్టేషన్‌లో అప్పగించారు.
బయటకు చెప్పొద్దని డబ్బులు
ఇవ్వబోయారు
మా అబ్బాయిని ముక్రం అనే అతను లోపలికి రమ్మని పిలిచి ముద్దులు పెట్టేవాడట.. గుడ్డలు ఊడదీసి, నూనె పట్టించి లైంగిక దాడి చేసేవాడు. ఏడు నెలలుగా ఈ వ్యవహారం సాగుతున్నా మదరసా వారు పట్టించుకోలేదు. ఈ విషయాన్ని బయటికి చెప్పొద్దని మాకు డబ్బులు ఇవ్వబోయారు.
- రహమతుల్లాఖాన్, యాస్మిన్, బాలుడి తల్లిదండ్రులు
కేసు నమోదు
బాలుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు లైంగిక దాడికి పాల్పడిన ముక్రంతోపాటు పాఠశాల యాజమాన్యంపై సీకే దిన్నె పోలీసులు కేసు నమోదు చేశారు. బాలుడిని వైద్య పరీక్షల నిమిత్తం రిమ్స్ ఆస్పత్రికి తరలించారు.