రహదారులు రక్తసిక్తం | Highways to bleed | Sakshi
Sakshi News home page

రహదారులు రక్తసిక్తం

Apr 19 2015 4:43 AM | Updated on Sep 2 2018 3:42 PM

జిల్లాలో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదంలో ఓ బాలుడు, ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు.

జిల్లాలో శనివారం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఓ బాలుడు సహా నలుగురు మృత్యువాతపడ్డారు. బాపులపాడు మండలం అంపాపురంలో సోదరిలతోపాటు పాఠశాలకు వెళ్లేందుకు రోడ్డు దాటుతున్న బాలుడి మీదుగా లారీ వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. జి.కొండూరు మండలంలోని కుంటముక్కల అడ్డరోడ్డు సమీపంలో జాతీయ రహదారిపై శనివారం సాయంత్రం బైక్ అదుపుతప్పి ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. తిరువూరు మండలం రోలుపడి వద్ద తిరువూరు-మధిర ఆర్ అండ్ బీ రహదారిపై శనివారం తెల్లవారుజామున ఒక యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.
 
జి.కొండూరు : జిల్లాలో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదంలో ఓ బాలుడు, ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. జి.కొండూరు మండలంలోని కుంటముక్కల అడ్డరోడ్డు సమీపంలో జాతీయ రహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడిక్కడే మృతి చెందారు.సేకరించిన సమాచారం మేరకు విజయవాడకు చెందిన బత్తిన సుకుమార్(24), హైదరాబాద్‌కు చెందిన కోటప్రోలు సాయి రాం(25) స్నేహితులు. సాయి కేసు విషయమై శనివారం వారిద్దరు కలిసి బైక్‌పై మైలవరం జూనియర్ సివిల్ కోర్టుకు వచ్చారు. సాయంత్రం తిరుగు ప్రయాణంలో వీరు ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనం కుంటముక్కల అడ్డరోడ్డు మలుపు వద్దకు వచ్చేసరికి అదుపు తప్పింది.

ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న నూజివీడు డీఎస్పీ వెంకటరమణతో పాటు ఎస్‌ఐ నబీ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. రహదారి నుంచి దాదాపు 15 మీటర్లుకు పైగా దూరంలో ఉన్న ముళ్ల పొదల్లో సుకుమార్ మృత దేహం పడి ఉండటంతో అతి వేగమే ప్రమాదానికి కారణమని నిర్థారణకు వచ్చారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను మైలవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సుకుమార్‌కు ఇటీవలే వివాహం జరగగా సాయి అవివాహితుడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement