నైరుతీ బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ఏర్పడిందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం బుధవారం వెల్లడించింది.
విశాఖపట్నం: నైరుతీ బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ఏర్పడిందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం బుధవారం వెల్లడించింది. ఈ నేపథ్యంలో నేడు, రేపు ఒకటి, రెండు చోట్ల ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. తెలంగాణలో చలి తీవ్రతకు కారణం సీజనల్గా వచ్చేదేనని పేర్కొంది. జిల్లాలోని అరుకు, చింతపల్లిలో 9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం తెలిపింది.
ఇదిలా ఉంటే తిరుమలలో బుధవారం ఉదయం భారీ వర్షం కురిసింది. శ్రీవారి ఆలయ పరిసర ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో భక్తులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. అలాగే నెల్లూరు జిల్లా కూడా భారీ వర్షం కురిసింది. నెల్లూరు, తడ, సూళ్లూరుపేట మండలాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో ఆయా ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడ్డారు.