అర్బన్ మండలం శెట్టిపల్లి పంచాయతీ మం గళం బీటీఆర్‌కాలనీలో ఆదివారం వై ఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభ జరుగనుంది.
= పార్టీ జిల్లా అగ్రనాయకుల రాక
=పార్టీశ్రేణులు పెద్ద ఎత్తున హాజరుకావాలి : చెవిరెడ్డి
తిరుపతి(మంగళం), న్యూస్‌లైన్: అర్బన్ మండలం శెట్టిపల్లి పంచాయతీ మం గళం బీటీఆర్‌కాలనీలో ఆదివారం వై ఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభ జరుగనుంది. ఉదయం 11గంటలకు జ రిగే ఈ సభను విజయవంతం చే యా లని పార్టీ శ్రేణులకు చంద్రగిరి నియోజకవర్గ సమన్వయకర్త చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పిలుపునిచ్చారు. పంచాయతీ కన్వీనర్ రుద్రగోపి, అశోక్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో శనివారం పార్టీ నాయకులు సభకు విస్తృత ఏర్పాట్లు చేశారు. ఏర్పాట్లను చెవిరెడ్డి పర్యవేక్షించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పా ర్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు అన్ని నియోజకవర్గాల్లో విస్తృతస్థారుు సమావేశాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ప్రభుత్వ వ్యతి రేక వి ధానాలను ఎలా తిప్పి కొట్టాలి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నట్లు తెలి పారు. ఇందులో భాగంగానే జిల్లాలోని పార్టీ అగ్రనాయకులు, సమన్వయకర్తలతో బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
ఈ సభలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పార్టీ జిల్లా కన్వీనర్ నారాయణస్వామి, తిరుపతి ఎ మ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, నియోజకవర్గ సమన్వయకర్తలు అమరనాథ్‌రెడ్డి, ఏఎస్ మనోహర్, ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, బియ్య పు మధుసూదన్‌రెడ్డి, సుబ్రమణ్యంరెడ్డి, పార్టీ నాయకులు పాల్గొంటారని తెలి పారు. ఈ సభకు ప్రజలు కూడా అధిక సంఖ్యలో తరలిరావాలని చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కోరారు.