సాక్షి, అమరావతి, ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్-1 ఇంటర్వ్యూలు ఈనెల 22 నుంచి ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 20వ తేదీ వరకు జరుగుతాయి. ఈ ఇంటర్వ్యూల నిర్వహణ కోసం 18మంది సీనియర్ ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం నియమించింది. కాగా, మొత్తం 152 ఉద్యోగ ఖాళీల భర్తీకి ఈ ఇంటర్వ్యూలు జరగనున్నాయి.