‘జీవో 6’ నిధుల జాడేదీ | 'GO 6' funds wher-Congress city president Malladi Vishnu | Sakshi
Sakshi News home page

‘జీవో 6’ నిధుల జాడేదీ

Mar 31 2016 3:10 AM | Updated on Mar 18 2019 8:51 PM

‘జీవో 6’ నిధుల జాడేదీ - Sakshi

‘జీవో 6’ నిధుల జాడేదీ

కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జారీచేసిన జీవో నెం.6 ద్వారా సెంట్రల్, పశ్చిమ నియోజకవర్గాలకు విడుదలచేసిన................

 కాంగ్రెస్ నగర అధ్యక్షుడు మల్లాది విష్ణు
 
అజిత్‌సింగ్‌నగర్ : కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జారీచేసిన జీవో నెం.6 ద్వారా సెంట్రల్, పశ్చిమ నియోజకవర్గాలకు విడుదలచేసిన సుమారు రూ. 47 కోట్లు ఏమయ్యాయని కాంగ్రెస్ నగర అధ్యక్షుడు మల్లాది విష్ణు నగరపాలక సంస్థను ప్రశ్నించారు. గతంలో అనేక సార్లు కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన నిధులు ఇంతవరకు ఖర్చు చేయలేదని విమర్శించారు. స్థానిక ఆంద్రప్రభ కాలనీలోని తన పార్టీ కార్యాలయంలో బుధవారం సాయంత్రం విలేకరులతో ఆయన మాట్లాడుతూ నగరపాలక సంస్థ నగరం నుంచి వేసవి సెలవులకు వెళ్లినట్లుగా ఉందని ఎద్దేవా చేశారు.

మౌలిక సదుపాయాలు కల్పించడం లేదన్నారు. తమ ప్రభుత్వ హయాంలో కండ్రికకు సుమారు రూ.100 కోట్లు భూగర్భడ్రెయినేజీకి, ముంపు నివారణకు కేటాయిస్తే ఆ పనులు ఇంతవరకూ ప్రారంభించలేదని విమర్శించారు.

 ఉగాది తర్వాత సమావేశం
కాంగ్రెస్ నగర కమిటీ మొదటి కార్యవర్గ సమావేశం ఉగాది తరువాత నిర్వహించనున్నట్లు తెలిపారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తామని వివరించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement