బాలికపై అకృత్యం | Gate men rape on student hostel | Sakshi
Sakshi News home page

బాలికపై అకృత్యం

Dec 31 2013 4:04 AM | Updated on Sep 2 2017 2:07 AM

ఏలూరు నడిబొడ్డున మరో మృగాడి అకృత్యం వెలుగుచూసింది. ముందూవెనుకా ఎవరూ లేకపోవడంతో హాస్టల్‌లో తలదాచుకుంటున్న ఓ అనాథ బాలికపై గేట్‌మెన్ అత్యాచారానికి ఒడిగట్టాడు.

 ఏలూరు సిటీ, న్యూస్‌లైన్ :  కంచే చేను మేసింది. ఏలూరు నడిబొడ్డున మరో మృగాడి అకృత్యం వెలుగుచూసింది. ముందూవెనుకా ఎవరూ లేకపోవడంతో హాస్టల్‌లో తలదాచుకుంటున్న ఓ అనాథ బాలికపై గేట్‌మెన్ అత్యాచారానికి ఒడిగట్టాడు. కంటికి రెప్పలా కాపాడాల్సిన వ్యక్తి ఇలాంటి దురాగతానికి పాల్పడ్డాడని తెలిసి జనం నివ్వెరపోయూరు. ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలోని విద్యార్థినులకూ భద్రత లేదనే విషయూన్ని ఈ వ్యవహారం మరోసారి బట్టబయలు చేసింది. వివరాల్లోకి వెళితే... ఏలూరు సత్రంపాడుకు చెందిన బాలిక తల్లిదండ్రులు ఆమె చిన్నతనంలోనే వుృతిచెందారు. అనాథగా మారిన ఆ బాలికను స్థానికులు చైల్డ్‌లైన్ సంస్థకు అప్పగించారు.

అనంతరం ఆమె గుండుగొలనులోని సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహంలో 8 నుంచి 10వ తరగతి వరకు చదివింది. చదువులో రాణిస్తుండడంతో సెరుుంట్ థెరిస్సా వుహిళా డిగ్రీ కాలేజీ ఆధ్వర్యంలోని ‘ఆశాకిరణం’లో బాలికను చేర్చుకున్నారు. అనంతరం ఏలూరు అమీనాపేటలోని సోషల్ వెల్ఫేర్ హాస్టల్‌లో చేరిన ఆమె స్థానికంగా ఉన్న ఓ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. అక్టోబర్‌లో దసరా సెలవులు ఇవ్వటంతో విద్యార్థినులంతా ఇళ్లకు వెళ్లిపోయారు. అనాథ కావటంతో ఆ విద్యార్థిని వూత్రం హాస్టల్‌లోనే ఉండిపోయింది. ఇదిలావుండగా, గణపవరానికి చెందిన వుందలంక మోహనరావు ఏడాది క్రితం ఔట్‌సోర్సింగ్‌లో అదే హాస్టల్‌లో గేట్‌మెన్‌గా చేరాడు. అతడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

హాస్టల్‌లో ఒంటరిగా ఉంటున్న విద్యార్థినిపై కన్నేసిన మోహనరావు ఆమెపై అత్యాచారం జరిపాడు. ఈ విషయుం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించడంతో ఆమె మౌనంగా ఉండిపోయింది. అప్పటినుంచి పలుమార్లు అత్యాచారం జరిపాడు. వారం రోజుల క్రితం ఆ విద్యార్థినికి ఒంట్లో బాగుండకపోవడంతో ఆసుపత్రికి వెళ్లింది. పరీక్షించిన వైద్యులు ఆమె గర్భం దాల్చినట్టు నిర్ధారించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. హాస్టల్ వార్డెన్ జయంతితో కలిసి బాధితురాలు సోమవారం టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. సీఐ కె.విజయుపాల్ కేసు నమోదు చేశారు. విషయం తెలుసుకున్న మోహనరావు అప్పటికే పరారయ్యాడు. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
 అనధికారికంగా విధులు?
 మోహనరావు వివరాల కోసం ‘న్యూస్‌లైన్’ ప్రయత్నించగా... అతడిని రెండు నెలల కిందటే విధుల నుంచి తొలగించామని హాస్టల్ అధికారులు చెబుతున్నారు. అతడు మాత్రం అనధికారికంగా హాస్టల్‌లోనే పనిచేస్తున్నట్టు సహచర సిబ్బంది తెలిపారు. విధుల నుంచి తొలగించిన గేట్‌మెన్‌ను హాస్టల్‌లోకి మళ్లీ ఎలా రానిస్తున్నారే ప్రశ్నకు సమాధానం కరువైంది. గేట్‌మెన్ ఎవరి ప్రమేయంతో హాస్టల్ వద్ద ఉంటున్నాడో తేలాల్సి ఉంది. ఈ వ్యవహారంపై జిల్లా ఉన్నతాధికారులు విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు, మహిళా సంఘాల ప్రతినిధులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement