కరోనా: ఒకే కుటుంబంలో నాలుగు కేసులు | Four Corona Positive Cases In Single Family At Visakhapatnam | Sakshi
Sakshi News home page

కరోనా: ఒకే కుటుంబంలో నాలుగు కేసులు

May 19 2020 10:39 AM | Updated on May 19 2020 10:41 AM

Four Corona Positive Cases In Single Family At Visakhapatnam - Sakshi

సాక్షి, మహారాణిపేట(దక్షిణం): జ్ఞానాపురం ప్రాంతానికి చెందిన ఒకే కుటుంబంలో నలుగురికి కరోనా సోకింది. దీంతో జిల్లాలో కరోనా కేసుల సంఖ్య 81కి చేరుకుంది. విజయనగరానికి చెందిన మహిళ ఇటీవల కరోనా వైరస్‌తో మృతి చెందగా నగరంలోని జ్ఞానాపురం శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరిగాయి. జ్ఞానాపురం ప్రాంతంలో ఉంటున్న దగ్గర బంధువైన జీఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుల్‌ ఈ కార్యక్రమానికి హాజరు కాగా రెండు రోజుల క్రితం కరోనా సోకింది. (ఆలయంలోకి పాము.. ఆడేసుకున్న పూజారి)

దీంతో అతని కుటుంబ సభ్యులతో పాటు బంధువులకు కరోనా నిర్ధారణ పరీక్ష చేయగా నలుగురికి వైరస్‌ సోకినట్లు తేలింది. ఇందులో ఇద్దరు పురుషులు(42 ఏళ్లు, 49 ఏళ్లు), ఇద్దరు మహిళలు(45 ఏళ్లు, 48 ఏళ్లు) ఉన్నారు. వీరంతా అతడి బంధువులు. ఈ కేసులను అధికారికంగా మంగళవారం ప్రకటించే అవకాశం ఉంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement