ఫ్యాన్స్‌ మధ్య ఫ్లెక్సీల చిచ్చు | Flexi war between Pawan Kalyan and Mahesh Babu fans in Kakinada | Sakshi
Sakshi News home page

ఫ్యాన్స్‌ మధ్య ఫ్లెక్సీల చిచ్చు

Sep 8 2017 3:35 AM | Updated on Mar 22 2019 5:33 PM

ఫ్యాన్స్‌ మధ్య ఫ్లెక్సీల చిచ్చు - Sakshi

ఫ్యాన్స్‌ మధ్య ఫ్లెక్సీల చిచ్చు

ఫ్లెక్సీల విషయంలో సినీ హీరోలు పవన్‌ కల్యాణ్, మహేశ్‌ బాబు అభిమానుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.

ముమ్మిడివరం: ఫ్లెక్సీల విషయంలో సినీ హీరోలు పవన్‌ కల్యాణ్, మహేశ్‌ బాబు అభిమానుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం మండలంలోని అనాతవరంలో బుధవారం రాత్రి గణేశ్‌ నిమజ్జనం సందర్భంగా జరిగిన ఊరేగింపులో మహేశ్‌ ఫ్యాన్స్‌ వదిలిన తారాజువ్వలు, బాంబులతో పవన్‌ ఫ్యాన్స్‌ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు ధ్వంసం కావడంతో రెండు వర్గాల మధ్య వివాదం చెలరేగింది. ఉద్దేశపూర్వకంగానే ఫ్లెక్సీలను ధ్వంసం చేశారని పేర్కొంటూ పవన్‌ ఫ్యాన్స్‌ అక్కడికి చేరడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. రాళ్లు రువ్వుకోవడం, సోడా సీసాలు విసురుకోవడంతో రెండు వర్గాలకు చెందిన ఆరుగురికి గాయాలయ్యాయి. గతంలో కూడా ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్నపుడు గ్రామస్తులు జోక్యం చేసుకొని వివాదాన్ని సర్దుబాటు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement