వ్యభిచారం కేసులో ఐదుగురి అరెస్టు | Five arrested in prostitution case | Sakshi
Sakshi News home page

వ్యభిచారం కేసులో ఐదుగురి అరెస్టు

Apr 16 2016 1:54 AM | Updated on Aug 17 2018 7:54 PM

వ్యభిచారం కేసులో ఐదుగురి అరెస్టు - Sakshi

వ్యభిచారం కేసులో ఐదుగురి అరెస్టు

అలిపిరి పోలీసు స్టేషన్ పరిధిలోని మంగళం రోడ్డులోని లాడ్జిలో నలుగురు విటులు సహా లాడ్జి నిర్వాహకుడిని అలిపిరి ...

తిరుపతి క్రైం: అలిపిరి పోలీసు స్టేషన్ పరిధిలోని మంగళం రోడ్డులోని లాడ్జిలో నలుగురు విటులు సహా లాడ్జి నిర్వాహకుడిని అలిపిరి పోలీసులు శుక్రవారం రాత్రి అరెస్టు చేశారు. అలిపిరి సీఐ శ్రీనివాసులు కథనం మేరకు.. మంగళం రోడ్డులోని ఓ ప్రైవేటు లాడ్జిలో వ్యభిచారం నిర్వహిస్తున్నట్టు సమాచారం రావడంతో ఎస్‌ఐ రాజేష్ తన సిబ్బందితో తనిఖీ చేశారు.


ఈ సందర్భంగా నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన హరీష్, యశ్వంత్‌రెడ్డి, బబ్బులు, దిలీప్, ఓ యువతిని అదుపులోకి తీసుకున్నారు. లాడ్జి నిర్వాహకులను కూడా అరెస్ట్ చేశారు. అనంతరం రిమాం డ్‌కు తరలించారు. యువతికి కౌన్సెలింగ్ ఇచ్చి పంపారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement