విజయనగరం జిల్లా జామి మండలం కుమరాము గ్రామంలో గురువారం రాత్రి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.
జామి: విజయనగరం జిల్లా జామి మండలం కుమరాము గ్రామంలో గురువారం రాత్రి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గ్రామంలో అర్ధరాత్రి దాటాక ఎగిసిపడిన మంటల్లో మూడు ఇళ్లు దగ్ధం అయ్యాయి. ఈ ఘటనలో రూ. 3 లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లింది. ఇది గుర్తించిన స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. కాగా ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.