వేగంగా వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో వెనుక నుంచి వస్తున్న ఆటో ఢీ కొట్టింది.
విజయనగరం: వేగంగా వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో వెనుక నుంచి వస్తున్న ఆటో ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఎనిమిది మంది మహిళలు గాయపడ్డారు. ఈ సంఘటన శుక్రవారం విజయనగరం జిల్లా గుర్ల మండలం కేంద్రంలో జరిగింది. వివరాలు.. మండలంలోని చుక్కవలస గ్రామానికి చెందిన 8 మంది మహిళలు ఆటోలో విజయనగరం వెళ్తుండగా చీపురుపల్లి నుంచి విజయనగరం వెళ్తున్న బస్సును ఢీ కొట్టింది. దీంతో గాయపడిన వారిని విజయనగరం ఆస్పత్రికి తరలించారు.