గోదావరి ఖనిలో అగ్ని ప్రమాదం: రూ.30 లక్షల ఆస్తి నష్టం | Fire Accident In Vegetable Market In Godavarikhani | Sakshi
Sakshi News home page

గోదావరి ఖనిలో అగ్ని ప్రమాదం: రూ.30 లక్షల ఆస్తి నష్టం

Nov 24 2013 10:17 AM | Updated on Sep 5 2018 9:45 PM

కరీంనగర్ జిల్లా గోదావరిఖనిలోని కొత్త కూరగాయాల మార్కెట్లో గత అర్థరాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది.

కరీంనగర్ జిల్లా గోదావరిఖనిలోని కొత్త కూరగాయాల మార్కెట్లో గత అర్థరాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఆ ఘటనలో దాదాపు 18 దుకాణాలు అగ్నికి ఆహుతయ్యాయి. అర్థరాత్రి సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దాంతో స్థానికులు వెంటనే స్పందించి పోలీసులు, అగ్నిమాపక శాఖ సిబ్బందికి సమాచారం అందించారు. ఇరు శాఖలు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నాయి.

 

ఎగసిపడుతున్న అగ్నికీలలను అగ్నిమాపక సిబ్బంది అదుపులోకి తీసుకువచ్చారు. అయితే అగ్నిప్రమాదంలో సరుకులు, కూరగాయలు అన్ని కాలిపోయాయని దుకాణదారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆ ప్రమాదంలో రూ.30 లక్షల అస్తి నష్టం సంభవించినట్లు పోలీసులు తెలిపారు. అగ్నిప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ లేక ఎవరైన కావలసి చేశారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement