తెలంగాణ బిల్లుకు తుదిమెరుగులు
రాష్ట్ర విభజన కోసం ఏర్పాటైన కేంద్ర మంత్రుల బృందం(జిఓఎం) సభ్యుడు జైరామ్ రమేష్ కేంద్ర హోంశాఖ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు.
	ఢిల్లీ: రాష్ట్ర విభజన కోసం ఏర్పాటైన కేంద్ర మంత్రుల బృందం(జిఓఎం) సభ్యుడు  జైరామ్ రమేష్ కేంద్ర హోంశాఖ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ బిల్లు-2013 (తెలంగాణ బిల్లు) ముసాయిదా న్యాయ శాఖ నుంచి హోంశాఖకు చేరింది.
	
	ముసాయిదా బిల్లుకు అధికారులు తుది మెరుగులు దిద్దుతున్నారు. ఈ బిల్లుపై   జిఓఎం సభ్యుల మధ్య ఏకాభిప్రాయం కుదిరితే ఈరోజే ఆమోదించే అవకాశం ఉంది. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ రాయల తెలంగాణపైనే మొగ్గు చూపుతున్న నేపధ్యంలో జిఓఎం సభ్యులు కూడా నిన్న  ఈ అంశంపైనే వాడివేడిగా చర్చించిన విషయం తెలిసిందే. రాయల తెలంగాణ తెరపైకి రావడంతో కొంత సంక్లిష్టత ఏర్పడింది.

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
