breaking news
Finishing touches
-
మరింత ఆసరా.. మరికొంత సాయం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల వాతావరణం వేడెక్కుతున్న నేపథ్యంలో అధికార భారత్ రాష్ట్ర సమితి పార్టీ మేనిఫెస్టోకు తుది మెరుగులు దిద్దడంలో నిమగ్నమైంది. ప్రధాన విపక్ష పార్టీలు కాంగ్రెస్, బీజేపీ ఇస్తున్న హామీలకు మించిన అంశాలతో ఎన్నికల ప్రణాళికను రూపొందిస్తు న్నట్టు తెలిసింది. ఈ నెలలో ప్రకటించే బీఆర్ఎస్ మేనిఫెస్టో ప్రతిపక్షాలకు దిమ్మ తిరిగేలా ఉంటుందని మంత్రి హరీశ్‌రావు పదే పదే చెబు తుండటం గమనార్హం. కాగా రైతుబంధు, ఆసరా పింఛన్ల పథకం కింద ఇస్తున్న మొత్తాన్ని పెంచడంపై కసరత్తు జరుగుతున్నట్లు సమాచారం. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్ల మొత్తాన్ని పెంచడంతో పాటు రైతులందరికీ పింఛన్ ఇవ్వాలనే ప్రతిపాదన సాధ్యాసాధ్యాలపై అధ్యయనం పూర్తయినట్లు తెలిసింది. రైతుబంధు, సామాజిక పింఛన్లు ఎంత మేర పెంచాలనే అంశంపై సీఎం కేసీఆర్ తుది నిర్ణ యం తీసుకోవాల్సి ఉందని పార్టీ వర్గాలు చెబుతు న్నాయి. వరంగల్‌లో ఈ నెల 16న బహిరంగ సభ వేదికగా పార్టీ మేని ఫెస్టోను ప్రకటించాలని బీఆర్ఎస్ భావించింది. అయితే పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఆరోగ్యా న్ని దృష్టిలో పెట్టుకుని వరంగల్ సభ వాయిదా పడే అవకాశముంది. ఈ నేపథ్యంలోనే ఎన్నికల షెడ్యూ ల్ వెలువడ్డాక త్వరగా మేనిఫెస్టోను ప్రక టించాలని కేసీఆర్ నిర్ణయించినట్లు తెలిసింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ తేదీకి ఐదు రోజుల ముందు మాత్రమే బీఆర్ఎస్ పార్టీ తన మేనిఫెస్టోను ప్రకటించింది. అయితే చాలా తక్కువ వ్యవధి కారణంగా మేనిఫెస్టోలోని అంశాలను ప్రజల్లోకి సరిగా తీసుకెళ్లలేకపోయినట్లు ఆ తర్వాత పార్టీ గుర్తించింది. ఈ నేపథ్యంలోనే ఈసారి వీలైనంత త్వరగా మేనిఫెస్టో విడుదల చేయాలని కేసీఆర్ భావిస్తున్నట్టు పార్టీవర్గాలు వెల్లడించాయి. విపక్షాల మేనిఫెస్టోలపై నజర్ గతంలో యువత, రైతు డిక్లరేషన్లు ప్రకటించిన కాంగ్రెస్ ఇటీవల తుక్కుగూడ సభ వేదికగా ఆరు గ్యారంటీల పేరిట ఎన్నికల హామీలను ప్రకటించింది. కర్ణాటక ఎన్నికల్లో ఐదు గ్యారెంటీలు ఫలితాన్ని ఇచ్చిన నేపథ్యంలో తెలంగాణలో ఆరు గ్యారంటీలను కాంగ్రెస్ ప్రధానంగా ప్రచారంలో పెడుతోంది. ఎన్నికల మేని ఫెస్టోలో మరిన్ని జనాకర్షక పథకాలను కూడా చేర్చే అవకాశముంది. బీఆర్ఎస్ బంగారు తెలంగాణ నినాదానికి విరుగుడుగా తాము సామాజిక తెలంగాణ నినాదాన్ని ఎత్తుకుని, ఆ మేరకు మేనిఫెస్టోలో ప్రతిఫలించేలా చూస్తామ ని కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు చెబుతున్నారు. మరోవైపు బీజేపీ కూడా సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ ఎన్నికల ప్రణాళికపై కసరత్తు చేస్తోంది. ఇలా రెండు ప్ర ధాన ప్రతిపక్ష పార్టీలు ప్రకటించే తాయిలాలు, ఇచ్చే హామీలను బీఆర్ఎస్ పరిగణనలోకి తీసుకుంటోందని, ఆయా అంశాలను మరిపించేలా బీఆర్ఎస్ మేనిఫెస్టో ఉండబోతోందని పార్టీ నేతలు చెబుతున్నారు. అన్ని పథకాల మొత్తాలు పెంపు? బీఆర్ఎస్ ప్రభుత్వం తొలిసారిగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆసరా పింఛన్ల మొత్తాన్ని రూ.200 నుంచి రూ.1,000కి పెంచింది. వితంతువులు, వృద్ధులు తదితరులకు ఇచ్చే ఈ పింఛన్‌ను తర్వాత రూ.2,016కు పెంచింది. కాగా ఈ మొత్తాన్ని రూ.3,016కు పెంచే అవకాశముందని, ఈ మేరకు మేనిఫెస్టోలో చేరుస్తున్నట్టు తెలుస్తోంది. వికలాంగుల పింఛన్ రూ.1,500తో ప్రారంభమై ప్రస్తుతం రూ.4,016కు చేరింది. ఈ మొత్తాన్ని కూడా మరో రూ.1,000 మేర పెంచే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక రైతుబంధు పథకం కింద ఏటా రెండు విడతల్లో కలుపుకొని ఎకరానికి రూ.10 వేలు చొప్పున ఇస్తుండగా, దీనిని రూ.12 వేలకు పెంచేలా ప్రతిపాదించినట్లు సమాచారం. అలాగే కేసీఆర్ కిట్ పథకం కింద ఇస్తున్న రూ.12 వేలను రూ.15 వేలకు పెంచాలనే ప్రతిపాదనపై సీఎం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని మేనిఫెస్టో రూపకల్పన కసరత్తులో పాల్గొంటున్న నేతలు చెప్తున్నారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకం కింద ఇస్తున్న మొత్తాన్ని కూడా పెంచడం ద్వారా విపక్షాల దూకుడుకు అడ్డకట్ట వేయాలని కేసీఆర్ భావిస్తున్నట్టు సమాచారం. -
రియల్మీ నుంచి ల్యాప్‌టాప్..ఆపిల్ మాక్‌బుక్‌ను పోలి ఉన్న ఫినిషింగ్..!
కోవిడ్-19 మహమ్మారి రాకతో ల్యాప్‌టాప్‌ల మార్కెట్ గణనీయంగా వృద్ధి చెందింది. ప్రజలు ఎక్కువగా వర్క్ ఫ్రమ్ హోంకే పరిమితమవ్వడంతో ల్యాప్‌టాప్ సేల్స్ భారీగా పెరిగాయి. ఆసుస్, డెల్, హెచ్‌పి, లెనోవో వంటి ల్యాప్‌టాప్ కంపెనీల కొనుగోళ్లలో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయి. అంతేకాకుండా ఈ కంపెనీలు భారీగా లాభాలను ఆర్జించాయి. దీంతో ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీలు కూడా ల్యాప్‌టాప్‌ల తయారీపై దృష్టిసారించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ రియల్మీ కూడా ల్యాప్‌టాప్ ఉత్పత్తిపై దృష్టిసారించింది. కాగా త్వరలోనే రియల్మీ నుంచి ల్యాప్‌టాప్ రిలీజ్ అవుతుందని కంపెనీ సీఈఓ మాధవ్ శేత్ ట్విటర్లో పోస్ట్చేశాడు. 2008 లో స్టీవ్ జాబ్స్ మొదటి తరం మాక్‌బుక్ ఎయిర్‌ను ఎలా ఆవిష్కరించారనే విషయాన్ని గుర్తుచేస్తూ, పేపర్‌బ్యాగ్‌లో ఉన్న రియల్మీ ల్యాప్‌టాప్ ఉన్న చిత్రాన్ని పోస్ట్ చేశాడు. ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ షావోమీకు చెందిన ల్యాప్‌టాప్‌లకు పోటీగా, రియల్మీ ల్యాప్‌టాప్‌ను రిలీజ్ చేయనుంది. రియల్మీ కంపెనీ భారత్, యూరప్ సీఈవో మాధవ్శేత్ తన ట్విటర్ ఖాతా నుంచి హల్లో వరల్డ్ అనే ఒక క్రిప్టిక్ మెసేజ్‌ను తెలుపుతూ చిత్రాన్ని పోస్ట్ చేశాడు. కాగా చిత్రంలో రియల్మీ ల్యాప్‌టాప్ ఆపిల్ మాక్‌బుక్ మాదిరిగానే ఫినిషింగ్ కల్గి ఉన్నట్లుగా తెలుస్తోంది.ల్యాప్‌టాప్ బాడీ అల్యూమినియం లేదా ప్లాస్టిక్‌తో తయారుచేశారనే విషయంలో కాస్త అస్పష్టత నెలకొంది. 01001000B 01100101B 01101100B 01101100B 01101111B 00100000B 01010111B 01101111B 01110010B 01101100B 01100100B 00100001B 00000000B#realme new product category has a message for you! Can you decode it & guess the product name that will add up to your #TechLife? pic.twitter.com/PhPcvn0668 — Madhav Max 5G (@MadhavSheth1) June 9, 2021 చదవండి: ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ వచ్చేశాయి.. మొబైల్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు..! -
తెలంగాణ బిల్లుకు తుదిమెరుగులు
ఢిల్లీ: రాష్ట్ర విభజన కోసం ఏర్పాటైన కేంద్ర మంత్రుల బృందం(జిఓఎం) సభ్యుడు జైరామ్ రమేష్ కేంద్ర హోంశాఖ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు-2013 (తెలంగాణ బిల్లు) ముసాయిదా న్యాయ శాఖ నుంచి హోంశాఖకు చేరింది. ముసాయిదా బిల్లుకు అధికారులు తుది మెరుగులు దిద్దుతున్నారు. ఈ బిల్లుపై జిఓఎం సభ్యుల మధ్య ఏకాభిప్రాయం కుదిరితే ఈరోజే ఆమోదించే అవకాశం ఉంది. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ రాయల తెలంగాణపైనే మొగ్గు చూపుతున్న నేపధ్యంలో జిఓఎం సభ్యులు కూడా నిన్న ఈ అంశంపైనే వాడివేడిగా చర్చించిన విషయం తెలిసిందే. రాయల తెలంగాణ తెరపైకి రావడంతో కొంత సంక్లిష్టత ఏర్పడింది.