తాగుబోతు కొడుకును రోకలితో కొట్టిచంపిన తండ్రి | Father kills drunkard son by hitting on head | Sakshi
Sakshi News home page

తాగుబోతు కొడుకును రోకలితో కొట్టిచంపిన తండ్రి

Dec 23 2013 8:39 AM | Updated on Aug 16 2018 4:36 PM

వరంగల్ జిల్లాలో దారుణం జరిగింది. తాగుడుకు బానిసైన కొడుకును రోకలితో కొట్టి చంపాడో కన్నతండ్రి.

వరంగల్ జిల్లాలో దారుణం జరిగింది. కన్న కొడుకు ఎలా ఉన్నా కడుపులో పెట్టుకుని సాకుతారు. కానీ సహనానికి కూడా ఓ హద్దుంటుంది. ఆ తండ్రి సహనం కోల్పోయాడు. భరించినన్నాళ్లు భరించాడు. ఇక తనవల్ల కాదనుకున్నాడు. నయాన చెప్పినా, భయాన చెప్పినా కొడుకు వినిపించుకోలేదు.

తాగుడుకు బానిసై నానా కష్టాలు పెడుతున్న కొడుకును ఏం చేయాలో అతడికి అర్థం కాలేదు. రోకలిబండ తీసుకున్నాడు.. కొడుకు తలపై ఒక్కటి కొట్టాడు. అంతే, ఆ కొడుకు కన్నుమూశాడు. ఈ దారుణ సంఘటన వరంగల్ జిల్లా చిన్నారావుపేటలో జరిగింది. తాగుడుకు బానిసగా మారిన తన కొడుకు ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోలేదని, అందుకే ఇక ఏమీ చేయలేని పరిస్థితిలో కొట్టానని ఆ తండ్రి అంటున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement