అప్పుల బాధ తాళలేక రైతు బలవన్మరణం | farmer suicide in prakasham district | Sakshi
Sakshi News home page

అప్పుల బాధ తాళలేక రైతు బలవన్మరణం

Jun 3 2015 6:58 PM | Updated on Nov 6 2018 7:56 PM

అప్పుల బాధ తట్టుకోలేక ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు.

ప్రకాశం: అప్పుల బాధ తట్టుకోలేక ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రకాశం జిల్లా పర్చూరు మండల పరిధిలోని నూతలపాడు గ్రామానికి చెందిన భవనం వెంకట సుబ్బారెడ్డి(32) బుధవారం వేకువజామున తన పొలంలో పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సుబ్బారెడ్డి ఏటా 15 ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నారు. అయితే, గత మూడేళ్లుగా నష్టాలు రావడంతోనే ఆత్మహత్యకు పాల్పడ్డారని ఆయన బంధువులు వాపోయారు. మృతునికి సుమారు రూ.5 లక్షల మేర వివిధ బ్యాంకుల్లో రుణాలు ఉన్నట్టు తెలిపారు. అలాగే, గ్రామంలో కూడా సుమారు రూ.20 లక్షలు అప్పులున్నట్లు సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement