మాజీమంత్రి ఈవూరి సీతారావమ్మ కన్నుమూత
మాజీ మంత్రి ఈవూరి సీతారావమ్మ(91) అనారోగ్య కారణంగా గురువారం కన్నుమూశారు. తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా పనిచేసిన ఆమె కూచినపూడి నియోజకవర్గం నుంచి 1985,1989, 1994లో వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు.
తెనాలి, న్యూస్‌లైన్: మాజీ మంత్రి ఈవూరి సీతారావమ్మ(91) అనారోగ్య కారణంగా గురువారం కన్నుమూశారు. తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా పనిచేసిన ఆమె కూచినపూడి నియోజకవర్గం నుంచి 1985,1989, 1994లో వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1995లో మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రిగా పనిచేశారు. అమెకు ముగ్గురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. 1978లో ఆమె భర్త ఈవూరి సుబ్బారావు జనతా పార్టీ తరఫున ఇదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. శుక్రవారం సాయంత్రం చెరుకుపల్లిలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.


