భద్రాచలం ప్రాంతాన్ని ఖమ్మం జిల్లా నుంచి విడదీయవద్దని డిమాండ్ చేస్తూ ఆదివారం నుంచి తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏలూరి శ్రీనివాసరావు ఖమ్మం కలెక్టరేట్ ఎదుట ఆమరణ నిరాహార దీక్ష చేపట్టనున్నారు.
ఖమ్మం, న్యూస్‌లైన్: భద్రాచలం ప్రాంతాన్ని ఖమ్మం జిల్లా నుంచి విడదీయవద్దని డిమాండ్ చేస్తూ ఆదివారం నుంచి తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏలూరి శ్రీనివాసరావు ఖమ్మం కలెక్టరేట్ ఎదుట ఆమరణ నిరాహార దీక్ష చేపట్టనున్నారు. 400 ఏళ్ల చరిత్ర కలిగిన భద్రాచలం ప్రాంతాన్ని ఖమ్మం జిల్లా నుంచి వేరు చేయడాన్ని నిరసిస్తూ ఉద్యోగ, రాజకీయ జేఏసీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు, ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రంపై మరింత వత్తిడి తేవాలని జేఏసీ నిర్ణయించిన మేరకు ఆమరణ నిరాహార దీక్షను చేపట్టనున్నట్లు ఏలూరి శ్రీనివాసరావు తెలిపారు.