తొమ్మిది పదుల యువకుడు

Elderly Man Living Without any Diseases In West Godavari - Sakshi

పశ్చిమగోదావరి ,తాడేపల్లిగూడెం రూరల్‌:  ఆవేశ పడితే బీపీ.. శారీరక వ్యాయామం లేకపోతే సుగర్‌.. కాస్త ఎక్కువగా నడిస్తే కీళ్ల నొప్పులు.. ఇవి నేటి ఆధునిక మానవుడిని వేధిస్తున్న దీర్ఘకాలిక వ్యాధులు. కానీ వీటికి భిన్నంగా పట్టణంలోని రెండో వార్డుకు చెందిన కవల కృష్ణమూర్తి(91) నిలుస్తున్నారు. తొమ్మిదో తరగతి చదివిన కృష్ణమూర్తి తొమ్మిది పదుల వయస్సు పైబడినప్పటికీ తన పనులు తాను చేసుకుంటూనే కళ్లజో డు లేకుండా వార్తా పత్రికలు చదవడం విశేషం. వయస్సు పైబడే కొలదీ వచ్చే బీపీ, సుగర్, కీళ్లనొప్పులు వంటివి ఏమీ ఆయన దరి చేరలేదు. వయస్సు పైబడినప్పటికీ నిత్య యవ్వనుడిగానే ఆయనను పేర్కొనవచ్చు. తన ఆరోగ్య రహస్యంపై ఆయనను ప్రశ్నిస్తే మాత్రంఇలా చెప్పుకొచ్చారు. ఆహారం విషయంలో సమయ పాలన పాటించడం, ఎటువంటి చెడు అలవాట్లు లేకపోవడమే కారణమంటున్నారు.

ఆయన ప్రస్తుత దినచర్య విషయానికొస్తే...
ఉదయం రెండు ఇడ్లీలు తిని తొమ్మిది గంటలకు ఇంటి వద్ద బయల్దేరి నెమ్మదిగా అదే వార్డు యర్రా నారాయణస్వామి మున్సిపల్‌ పాఠశాల ఆవరణలోని గ్రంథాలయానికి రావడం వార్తా దినపత్రికలను చదవడం. తదుపరి మధ్యాహ్నం 12 గంటలకు, సాయంత్రం5 గంటలకు భోజనం. ఇదే ఆయన ఆహార పట్టిక. తొమ్మిది పదుల వయస్సు పైబడిన వృద్ధాప్యంలోనూ కనీసం కళ్లజోడు కూడా లేకుండా వార్తాపత్రికలను మొదటి నుంచి చివరి పేజీ అక్షరం వదలకుండా అవలీలగా చదివేస్తారు. ఈ వయస్సులో కనీసం బీపీ, సుగర్, కీళ్లనొప్పులు వంటి ఆరోగ్య సమస్యలు ఆయన దరి చేరకపోవడం విశేషం. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top