ఎంసెట్ కౌన్సెలింగ్ యథాతథం | EAMCET counselling to be as per schedule | Sakshi
Sakshi News home page

ఎంసెట్ కౌన్సెలింగ్ యథాతథం

Jul 29 2014 3:28 PM | Updated on Sep 2 2017 11:04 AM

ఎంసెట్ కౌన్సెలింగ్ యథాతథం

ఎంసెట్ కౌన్సెలింగ్ యథాతథం

విద్యార్థులంతా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియను యథాతథంగా నిర్వహించాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది.

విద్యార్థులంతా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియను యథాతథంగా నిర్వహించాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావుతో ఉన్నత విద్యామండలి ఛైర్మన్ వేణుగోపాలరెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య ఎంసెట్ కౌన్సెలింగ్ విషయమై చర్చ జరిగింది. తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకించినా సరే.. ఎంసెట్ కౌన్సెలింగ్ను ఆలస్యం చేయడం సరికాదని, అలా చేస్తే విద్యార్థుల భవిష్యత్తు నాశనం అవుతుందని ఉన్నత విద్యామండలి భావిస్తున్నట్లు సమాచారం.

ఆలస్యంగా విద్యాసంవత్సరం మొదలైతే.. భవిష్యత్తులో వాళ్ల పీజీ కోర్సుల దగ్గర నుంచి ఉద్యోగ నియామకాల వరకు అన్నింటిలోనూ ఇబ్బంది అవుతుంది. ఈ ఉద్దేశంతోనే కౌన్సెలింగ్ ప్రక్రియను యథాతథంగా కొనసాగించాలని మండలి భావిస్తోంది. సాయంత్రం 5 గంటల తర్వాత మీడియా సమావేశం ఏర్పాటుచేసి, తెలంగాణ ప్రభుత్వం కూడా కౌన్సెలింగ్కు సహకరించాలని ఉన్నత విద్యామండలి ఛైర్మన్ వేణుగోపాలరెడ్డి కోరనున్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement